Telugu Cinema Industry Hero: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎవ్వరికి లేనటువంటి గొప్ప గుర్తింపును సంపాదించుకున్న నటుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)…ఆయన ప్రస్తుతం పాలిటిక్స్ లో చాలా బిజీగా ఉన్నప్పటికి ఎప్పటికప్పుడు తన అభిమానులను సినిమాలతో అలరిస్తూ ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలోనే రీసెంట్ గా హరిహర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికి ఆ సినిమా ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేకపోయింది… దాంతో ప్రస్తుతం ఓజీ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేస్తున్నాడు…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతనికి గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. అందువల్లే ఆయన తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికి లేనటువంటి గొప్ప ఫ్యాన్ ఫాలోయింగ్ ను అయితే సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎం గా తన పదవి బాధ్యతలను కొనసాగిస్తున్న ఆయన ఇకమీదట కూడా అడపదడప సినిమాలను చేయాలని అనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన కొన్ని సినిమాలు డిజాస్టర్లను మూటగట్టుకున్నాయి. అలాంటి సందర్భంలో కొంతమంది నిర్మాతలు నష్టపోయారు. ఇక పవన్ కళ్యాణ్ డైరెక్షన్ లో వచ్చిన జానీ సినిమా విషయం భారీ ప్లాప్ అవ్వడంతో అల్లు అరవింద్ భారీగా నష్టపోయాడు. దాంతో పవన్ కళ్యాణ్ తన రెమ్యూనరేషన్ మొత్తాన్ని వెనక్కి ఇచ్చేశాడు. అలాగే బంగారం సినిమాతో ఏ ఏం రత్నం కూడా చాలా వరకు నష్టాలను చవిచూడాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది. దానివల్ల ఈ సినిమా రెమ్యూనరేషన్ ని కూడా పవన్ కళ్యాణ్ వెనుక అయితే ఇచ్చేసాడు. అలాగే తీన్మార్ సినిమా ప్లాప్ అయినప్పుడు కూడా ప్రొడ్యూసర్ బండ్ల గణేష్ కి తన రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చినట్టుగా బండ్ల గణేష్ తెలియజేశాడు.
Also Read: తెలుగు స్టార్ డైరెక్టర్లను తన సినిమాలకి డైలాగ్ రైటర్ గా వాడుకుంటున్న రాజమౌళి…
ఇలా తను చేసిన చాలా సినిమాలు డిజాస్టర్లను మూటగట్టుకున్న సందర్భంలో ఆయా ప్రొడ్యూసర్లను ఆదుకోవడానికి తను తీసుకున్న రెమ్యూనరేషన్ ను వెనక్కి ఇచ్చేసిన హీరో కూడా తనే కావడం విశేషం…మరి ఇప్పుడు ఓజి సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పిస్తాడా?
ఇప్పటివరకు ఆయన తన కెరియర్ లో చేయనటువంటి ఒక గొప్ప కథతో ఈ సినిమా వస్తుందని పవన్ కళ్యాణ్ అభిమానులైతే భావిస్తున్నారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉంటుందా? యావత్ ఇండియన్ సినిమా ప్రేక్షకులందరిని మెప్పించి పవర్ స్టార్ రేంజ్ ఏంటో మరోసారి చూపిస్తుందా?
Also Read: స్పిరిట్ vs ఎస్ఎస్ఎంబి 29 ల మధ్య భారీ పోటీ ఉండబోతుందా..?
లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి… ఇక ఇలాంటి క్రమంలోనే ఇకమీదట ఆయన సినిమాలు చేస్తాడా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతానికైతే సెట్స్ మీద ఉంచిన సినిమాలన్నింటిని పూర్తి చేసిన తర్వాత ఆయన మిగతా సినిమాల గురించి ఆలోచిస్తానని చెబుతున్నట్టుగా తెలుస్తోంది…