https://oktelugu.com/

Mahesh Babu: మహేష్ జీవితాన్ని మార్చేసిన ఆ ముగ్గురు ఆడవాళ్లు… రివీల్ చేసిన సూపర్ స్టార్!

మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలు పంచుకుంటారు. అలాగే సామాజిక విషయాల మీద స్పందిస్తారు. ఫ్యాన్స్ కి ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు.

Written By:
  • S Reddy
  • , Updated On : March 9, 2024 / 01:19 PM IST

    Those three women who changed Mahesh life

    Follow us on

    Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు జీవితంలో ఆ ముగ్గురు మహిళలు చాలా కీలకం అట. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. టాలీవుడ్ టాప్ స్టార్ మహేష్ కి ప్రత్యేకమైన ఆ ముగ్గురు ఆడవాళ్లు ఎవరో చూడండి. మహేష్ బాబు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్. వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలు పంచుకుంటారు. అలాగే సామాజిక విషయాల మీద స్పందిస్తారు. ఫ్యాన్స్ కి ఎప్పుడూ అందుబాటులో ఉంటాడు. మార్చి 8న ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే. ఈ సందర్భంగా ఇంస్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టారు.

    నాకు ప్రేమ, ధైర్యం, ఆనందం పంచిన మీకు హ్యాపీ ఉమెన్స్ డే అని ఒక ఫోటో జోడించారు. ఆ ఫోటోలో మహేష్ తల్లిగారు ఇందిరాదేవి, భార్య నమ్రత శిరోద్కర్, కూతురు సితార ఘట్టమనేని(Sitara) ఉన్నారు. తన జీవితాన్ని మార్చేసిన ముగ్గురు అత్యంత ముఖ్యమైన మహిళలు వారని, మహేష్ పరోక్షంగా తెలియజేశారు. జన్మనిచ్చిన తల్లితో పాటు భార్య, కూతురికి ఆయన సమాన స్థానం ఇచ్చాడు.

    కాగా మహేష్ పక్కా ఫ్యామిలీ మ్యాన్. ఆయన పార్టీలకు కూడా భార్యతో వెళతారు. ఇక విరామం దొరికితే ఇంట్లో ఉంటారు. తరచుగా ఫ్యామిలీతో టూర్స్ కి వెళతారు. టాలీవుడ్ లో మహేష్ బాబు వేసినన్ని ఫారిన్ ట్రిప్స్ మరో హీరో వేయడు అంటే అతిశయోక్తి కాదు. భార్య, పిల్లలతో ఇష్టమైన దేశానికి చెక్కేస్తారు. సితార పట్ల అమిత ప్రేమ చూపిస్తాడు. ఇక మహేష్ కెరీర్ పరిశీలిస్తే గుంటూరు కారంతో సంక్రాంతికి ప్రేక్షకులను అలరించాడు. మూవీ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా… మహేష్ మేనరిజమ్, మాస్ యాక్టింగ్ మార్క్స్ పడ్డాయి.

    నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి సిద్ధం అవుతున్నాడు. దర్శకుడు రాజమౌళితో మహేష్ ఫస్ట్ టైం పని చేస్తున్నాడు. స్క్రిప్ట్ ఫైనల్ దశలో ఉందని సమాచారం. త్వరలో ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుకానున్నాయి. ఇది జంగిల్ అడ్వెంచర్ యాక్షన్ డ్రామా అట. హాలీవుడ్ హిట్ సిరీస్ ఇండియానా జోన్స్ వలే ఉంటుందని రాజమౌళి తెలియజేశారు. విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఈ చిత్రానికి హాలీవుడ్ టెక్నీషియన్స్ పని చేయనున్నారని సమాచారం.