Tholiprema Collections: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైం క్లాసికల్ లవ్ స్టోరీ గా నిల్చిన చిత్రం ‘తొలిప్రేమ’. అప్పటి వరకు మామూలు హీరో గా ఇండస్ట్రీ లో కొనసాగిన పవన్ కళ్యాణ్, ఈ చిత్రం తర్వాత యూత్ ఐకాన్ గా స్టార్ హీరో గా మారిపోయాడు. ఆరోజుల్లో ఈ సినిమా సృష్టించిన బాక్స్ ఆఫీస్ సునామి మామూలుది కాదు. కేవలం నైజాం ప్రాంతం నుండే ఈ సినిమా నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించింది.
సంధ్య ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో సంవత్సరం రోజులు ఆడింది. అప్పటి జెనెరేషన్ లో కానీ, ఇప్పటి జెనెరేషన్ స్టార్స్ లో కానీ ఒక్కరికి కూడా ఆ రేంజ్ థియేట్రికల్ రన్ లేదు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. అలాంటి ఆల్ టైం క్లాసిక్ చిత్రం మరోసారి 4K కి మార్చి గత కొద్దిరోజుల క్రితమే గ్రాండ్ గా రీ రిలీజ్ చేసారు.
అభిమానులు ఈ చిత్రానికి దూరంగా ఉండాలి అని నిర్ణయించుకున్నప్పటికీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి రోజు నుండే అద్భుతమైన వసూళ్లు నమోదు అయ్యాయి. మొదటి రోజే కోటి రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించిన ఈ సినిమా , మూడు రోజులకు కలిపి కోటి 80 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, అలాగే క్లోసింగ్ లో లో రెండు కోట్ల రూపాయిల గ్రాస్ ని రాబట్టినట్టు తెలుస్తుంది.
ఈ సినిమాని 4K కి మార్చడానికి డిస్ట్రిబ్యూటర్ కి అయిన ఖర్చు 25 లక్షల రూపాయిలు. ఫుల్ రన్ లో ఈ సినిమాకి కోటి రూపాయలకు పైగా షేర్ వసూళ్లు వచ్చాయి. అంటే 75 లక్షల రూపాయిల లాభం అన్నమాట. అసలే సినిమాలకు సరైన బిజినెస్ లేక థియేటర్స్ వెలవెలబోతున్న సమయం లో తొలిప్రేమ చిత్రానికి ఆడియన్స్ నుండి ఈ రేంజ్ రెస్పాన్స్ రావడం కాస్త థియేటర్స్ యాజమాన్యాలకు ఊపిరి పోసింది.