కాగా నేడు ఈ అందాల చిన్నదాని పుట్టినరోజు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ క్రేజీ బ్యూటీకి బర్త్ డే విషెస్ చెప్పడానికి పోటీ పడుతున్నారు నెటిజన్లు. ఇక సినిమాల విషయానికి వస్తే.. కృతి చేతిలో ప్రజెంట్ నాలుగు సినిమాలు ఉన్నాయి. సినిమాకి కోటి నుంచి రెండు కోట్లు డిమాండ్ చేస్తోంది.
మొదటి సినిమాకి ఆమెకు ఇచ్చింది ముప్పై లక్షలు. కానీ రెండో సినిమాకి ఆమెకు దక్కిన రెమ్యునరేషన్ కోటి పది లక్షలు. ఇది కృతికి దక్కిన స్టార్ డమ్. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఐదు కోట్ల వరకు సంపాదించిందట ఈ భామ. ఇక జీటీవీ ప్రొమోషన్ లో పాల్గొని అటు నుంచి కూడా దాదాపు 80 లక్షలు వరకు రెమ్యునరేషన్ అనుకుంది.
మొత్తానికి అతి చిన్న వయసులోనే బ్రాండ్స్, సినిమాలతో ఫుల్లుగా సంపాదిస్తోంది ‘కృతి శెట్టి’. ప్రస్తుతం ‘కృతి శెట్టి’ ఇంద్రగంటి దర్శకత్వంలో వస్తున్న ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ సినిమా షూట్ లో పాల్గొంటుంది. అలాగే ఈ సినిమా షూట్ తర్వాత రామ్ – లింగుస్వామి సినిమా షూట్ లో జాయిన్ కానుంది.
ఇక నాని హీరోగా నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాని ఇప్పటికే పూర్తి చేసింది. అలాగే ‘కృతి శెట్టి’ చేతిలో నితిన్ హీరోగా నటిస్తున్న ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమా కూడా ఉంది.