PM Modi AP visit: ప్రధాని నరేంద్ర మోడీ( Prime Minister Narendra Modi) పర్యటన కూటమి ఐక్యతను చాటింది. ప్రధాని మోదీ వ్యూహాత్మకంగా వ్యవహరించారు. సూపర్ జిఎస్టి సూపర్ సక్సెస్ పేరిట నిర్వహించిన ఈ సభ విజయవంతం అయింది. శ్రీశైలం ఆలయ సందర్శన, జీఎస్టీ రోడ్ షోలో సీఎం చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు ప్రధాని మోదీ. అదే సమయంలో మంత్రి నారా లోకేష్ విషయంలో కూడా మోదీ వ్యవహరించిన తీరు అభినందనలు అందుకుంటుంది. అందర్నీ సమపాళ్లలో ప్రాధాన్యం ఇచ్చారు. ముగ్గురు నేతలు ముఖ్యమైన సంకేతాలు పంపారు. భవిష్యత్ రాజకీయాలను దిశా నిర్దేశం చేశారు. ఇప్పటివరకు ప్రత్యర్థులకు ఉన్న అంచనాలను పటాపంచలు చేశారు. తద్వారా తామంతా ఐక్యంగా ఉంటామని గట్టి సంకేతాలు పంపగలిగారు.
ఒకరికి మించి ఒకరు..
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ అభివృద్ధికి అన్ని విధాలా సహకారం అందిస్తామని చెప్పారు. సీఎం చంద్రబాబు( CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమర్థ నాయకులుగా అభివర్ణించారు. వారి నేతృత్వంలో ఏపీ అభివృద్ధి సాధిస్తుందని చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు అయితే ప్రధాని మోదీని ఆకాశానికి ఎత్తేశారు. 21వ శతాబ్దానికి భారతదేశానికి లభించిన గొప్ప నాయకుడు మోదీ అని అభివర్ణించారు. మరో 15 ఏళ్ల పాటు కూటమి నిశ్చింతగా ముందుకెళ్తుందని తేల్చి చెప్పారు. రాష్ట్రంలో చంద్రబాబు, దేశంలో దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ నాయకత్వంలో పనిచేస్తామని తేల్చి చెప్పారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా అధిగమించి కలిసే ఉంటామని స్పష్టం చేశారు. ఒక విధంగా ఇది రాజకీయ ప్రత్యర్థులకు హెచ్చరిక.
వైయస్సార్సీపి ఆలోచనలకు భిన్నంగా..
మొన్న ఆ మధ్యన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) కూటమి ఎన్నో రోజులు ఉండదని తేల్చి చెప్పారు. తప్పకుండా విడిపోతుంది అన్నట్టు మాట్లాడారు. అదే సమయంలో అనేక రకాల విశ్లేషణలు వచ్చాయి. అయితే ఆది నుంచి కూటమి విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆలోచన అదే. తరచూ ఒంటరి పోరాటం మాట ఎక్కువగా వస్తుంటుంది వైసిపి శ్రేణుల నుంచి. తద్వారా మూడు పార్టీలు విడిపోవాలన్నది వారి లక్ష్యం. అయితే నిన్నటి పర్యటనతో ఫుల్ క్లారిటీ వచ్చింది. జాతీయస్థాయిలో ఎన్డీఏ కూటమి, ఏపీలో టీడీపీ కూటమి మరో 15 ఏళ్ల పాటు కొనసాగుతుందని కర్నూలు వేదికగా చెప్పగలిగారు. అటు బిజెపి సైతం రాష్ట్రానికి సహకరిస్తామని చెప్పడమే కాకుండా.. రాజకీయంగాను సమర్థ నాయకత్వం ఉందని చెప్పడం ద్వారా గట్టి సంకేతాలే పంపగలిగారు.