Trivikram Srinivas: పాన్ ఇండియా సినిమా చేయడానికి భయపడుతున్న ఈ స్టార్ డైరెక్టర్…

మిగిలిన డైరెక్టర్లు అందరూ కూడా పాన్ ఇండియా డైరెక్టర్లు అవ్వడానికి చాలా కసరత్తులు చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా లో డైరెక్టర్ గా గుర్తింపు పొందటానికి ఇష్టపడటం లేదనే విషయం అర్థమవుతుంది.

Written By: Gopi, Updated On : January 6, 2024 4:27 pm

Trivikram Srinivas

Follow us on

Trivikram Srinivas: ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ వరుసగా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేస్తున్నారు అయితే అందరి దృష్టి కూడా ఒకటే ఇండస్ట్రీ లో వాళ్ళ సత్తా చాటాలని ప్రతి ఒక్కరు ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. అయితే ఇప్పటివరకు తెలుగు నుంచి పాన్ ఇండియా రేంజ్ లో డైరెక్టర్లు ముగ్గురు మాత్రమే ఉన్నారు. అందులో రాజమౌళి, సుకుమార్, సందీప్ రెడ్డి వంగ లాంటి స్టార్ డైరెక్టర్లు ఉన్నారు.ఇక వాళ్ళతో పాటు గా కార్తికేయ 2 సినిమాతో తన సత్తా చాటుకున్న చందు మొండేటి కూడా పాన్ ఇండియా డైరెక్టర్ గా మంచి గుర్తింపు ను సంపాదించుకున్నాడు.

ఇక మిగిలిన డైరెక్టర్లు అందరూ కూడా పాన్ ఇండియా డైరెక్టర్లు అవ్వడానికి చాలా కసరత్తులు చేస్తున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం పాన్ ఇండియా లో డైరెక్టర్ గా గుర్తింపు పొందటానికి ఇష్టపడటం లేదనే విషయం అర్థమవుతుంది…అందుకే గుంటూరు కారం సినిమాని ఒక తెలుగు లోనే రిలీజ్ చేస్తున్నాడు.ఆయన పాన్ ఇండియా సినిమా అంటే ఎందుకు భయపడుతున్నాడో అర్థం కావడం లేదు.

ఇంతకుముందు ఆయన డైరెక్షన్ లో వచ్చిన సినిమాలను కూడా పాన్ ఇండియా లో రిలీజ్ చేయలేదు. త్రివిక్రమ్ ఒక్కడే పాన్ ఇండియాకి చాలా దూరంగా ఉంటున్నట్టుగా తెలుస్తుంది. గుంటూరు కారం సినిమాను కూడా తెలుగుకి మాత్రమే పరిమితం చేస్తున్నాడు అని ఆయన ఫ్యాన్స్ తో పాటు పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…ప్రస్తుతం డైరెక్టర్లు అందరూ పాన్ ఇండియా లో సినిమాలను చేస్తుంటే తను మాత్రం తెలుగుకి ఎందుకు పరిమితం అవుతున్నాడు అనేది అర్థం కావడం లేదు. ఇక ఇంతకుముందు అలా వైకుంఠపురంలో సినిమాతో తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అయితే అదే సినిమాని బాలీవుడ్ లో రీమేక్ చేస్తే మాత్రం అక్కడ ఈ సినిమా డిజాస్టర్ అయింది.

ఆయన సినిమాలు బాలీవుడ్ జనాలని ఆకట్టుకోలేవా అందుకే ఆయన తెలుగు కు మాత్రమే పరిమితం అవుతున్నాడా అనే సందేహాలు కూడా ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఇక ఇప్పటికే గుంటూరు కారం సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ ని మొదలుపెట్టారు. ఈ సినిమా జనవరి 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ క్రమంలోనే ఈయన చేసే సినిమాలు తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తున్నాయి. మరి ఈయన కథలు బాలీవుడ్ లో ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి అనేది కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది…