https://oktelugu.com/

Hyundai Exter: లక్షరూపాయలు ఉన్నాయా? అయితే ఈ కారు మీ సొంతం..

దేశీయ ఆటోమోబైల్ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన వివిధ మోడళ్లు ఇప్పటికే వినియోగదారులను ఆకర్షించాయి. లేటేస్టుగా రిలీజ్ అయిన ఎక్స్ టర్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Written By:
  • Srinivas
  • , Updated On : January 6, 2024 4:30 pm
    Hyundai Exter

    Hyundai Exter

    Follow us on

    Hyundai Exter: కారు కొనుగోలు చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఎటువంటి కారు కొనాలి? తక్కువ బడ్జెట్ లో వచ్చే కార్లేవి? అని ఆరా తీసేవారు కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని కంపెనీలు వినియోగదారులను ఆకర్షించేందుకు డిస్కౌంట్లు ప్రకటిస్తాయి. అలాగే ఒకేసారి పెట్టుబడి పెట్టేస్తోమత లేకపోవడంతో ఈఎంఐ సదుపాయం కోసం సెర్చ్ చేస్తారు. ఈఎంఐ సౌకర్యం ఉన్నా కంపెనీలు లక్షకు మించి డౌన్ పేమేంట్ విధిస్తాయి. కానీ ఓ కంపెనీ మాత్రం కేవలం లక్ష రూపాయలు చెల్లించి కారును ఇంటికి తీసుకుపోవచ్చు అని ఆఫర్ ప్రకటించింది. అంతేకాకుండా ఈ కారును తక్కువ ధరకే అందించనున్నట్లు పేర్కొంది. ఇంతకీ ఆ కారు వివరాల్లోకి వెళితే..

    దేశీయ ఆటోమోబైల్ మార్కెట్లో హ్యుందాయ్ కంపెనీ దూసుకుపోతుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన వివిధ మోడళ్లు ఇప్పటికే వినియోగదారులను ఆకర్షించాయి. లేటేస్టుగా రిలీజ్ అయిన ఎక్స్ టర్ వినియోగదారులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. హ్యుందాయ్ ఎక్స్ టర్ SUVని కేవలం లక్ష రూపాయలు చెల్లించి ఇంటికి తీసుకునే సౌకర్యాన్ని కంపెనీ కల్పించింది. ఎక్స్ టర్ లో అన్నీ కలిపి 17 వేరియంట్లు ఉన్నాయి. ఇందులో రూ.6 లక్షల (ఎక్స్ షోరూం) నుంచి రూ.10.15 లక్షల ధర వరకు కార్లు అందుబాటులో ఉన్నాయి.

    వీటిలో ఎక్స్ టర్ EX అతి తక్కువ ధరకు అందుబాటులో లభించే అవకాశం ఉంది. దీనిని రూ.6.67 లక్షలతో విక్రయిస్తున్నారు. ఈ కారును లక్ష డౌన్ పేమేంట్ చేసి సొంతం చేసుకునే అవకాశం కల్పించింది. అంటే రూ.5.67 లక్షల రుణం తీసుకునే అవకాశం కల్పిస్తుంది. ఐదేళ్ల కాలంలో రూ.11,778 ఈఎంతో చెల్లిస్తూ 9 శాతం వడ్డీని అధికంగా చెల్లించే అవకాశాన్నికల్పిస్తుంది. మొత్తంగా రూ.1.4 లక్షలను అదనంగా చెల్లిస్తారు.

    ఎక్స్ టర్ లోని మరో మోడల్ S. దీనిని 7.37 లక్షల ఎక్స్ షోరూం ధరతో విక్రయిస్తున్నారు. ఈ మోడల్ కు కూడా లక్ష డౌన్ పేమేంట్ చెల్లిస్తే కారును ఇచ్చేస్తారు. అయితే ఆయా ప్రాంతాలను బట్టి స్వల్పంగా ధరలు మారే అవకాశం ఉంది. అందువల్ల షోరూం ప్రతినిధులను కలిసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఇక ఈ రెండు మోడళ్లు పెట్రోల్ తో పాటు సీఎన్ జీ ఆప్షన్లలో లభిస్తాయి. పెట్రోల్ 19.4 కిలోమీటర్లు, సీఎన్ జీ 27.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. అన్ని వేరియంట్లకు 6 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి.