https://oktelugu.com/

Cinema Industry : ఇండియన్ సినిమా ఇండస్ట్రీ లోనే ఈ సినిమా అతి పెద్ద డిజాస్టర్…కలెక్షన్స్ ఎంత వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు…

తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ల సత్తా చాటుకుంటున్నారు. ఇక మన హీరోలనుంచి ఎదురయ్యే పోటీని తట్టుకోలేక బాలీవుడ్ హీరోలు సైతం భారీ సూపర్ హిట్ ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇలాంటి సందర్భంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీ టాప్ లెవల్లో ముందుకు దూసుకెళ్లడం విశేషం...

Written By:
  • Gopi
  • , Updated On : January 27, 2025 / 08:38 AM IST
    Cinema Industry

    Cinema Industry

    Follow us on

    Cinema Industry : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న క్రమంలో బాలీవుడ్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి అందులో భాగంగానే వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. అయినప్పటికి వాళ్లకు సరైన గుర్తింపు అయితే రావడం లేదు. నిజానికి గత కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ హీరోలు సరైన సక్సెస్ ని సాధించడంలో మాత్రం విఫలమవుతున్నారు. అక్షయ్ కుమార్ హీరోగా వచ్చిన ‘బడే మియా చోటే మియా’ సినిమా భారీ అంచనాల మధ్య వచ్చి డిజాస్టర్ బాట పట్టింది. మరి ఆ సినిమాతో అక్షయ్ కుమార్ వరుసగా ఫ్లాప్ సినిమాల పరం పరను కొనసాగిస్తూ వచ్చాడు… ఇక ఇప్పుడు ‘ఔరోన్ మే కహన్ ధమ్ థా’ అనే సినిమా రీసెంట్ గా రిలీజ్ అయి డిజాస్టర్ బాట పట్టింది. నిజానికి ఈ సినిమాలో అజయ్ దేవగన్, టబూ లాంటి టాప్ స్టార్లు నటించారు. ఇక కుటుంబ కథ చిత్రం గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

    దాదాపు 200 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కితే కేవలం 12.91 కోట్ల కలెక్షన్లు మాత్రమే రాబట్టడం అనేది ఈ సినిమా డిజాస్టర్ కి భారీ కారణంగా మారింది. ఇక ఇప్పటివరకు బాలీవుడ్ హిస్టరీ లోనే అతిపెద్ద డిజాస్టర్ గా ఈ సినిమా నిలిచింది…సినిమా మొదట్లో కుటుంబ కథ నేపథ్యంలో ఈ సినిమా సాగినప్పటికి ఆ తర్వాత సస్పెన్స్ గా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు.

    దర్శకుడు ఇక ప్రేమ కథ కేంద్రంగా నడిచిన ఈ సినిమా డిజాస్టర్ బాట పట్టడంతో బాలీవుడ్ హీరో అయిన అజయ్ దేవగన్ ఇమేజ్ అనేది భారీగా తగ్గిపోయిందనే చెప్పాలి. ఇక ఏది ఏమైనా కూడా రీసెంట్ గా ఓటిటి లో రిలీజ్ అయింది. ఇక అమెజాన్ ప్రైమ్ లో అవలేబుల్ లో ఉన్న ఈ సినిమాని చూడడానికి చాలామంది ప్రేక్షకులు ఉత్సాహం చూపించడం విశేషం.

    ఇక థియేటర్లో ఫెయిల్ అయిన ఈ సినిమా ఓటిటి లో మాత్రం సూపర్ సక్సెస్ ఫుల్ గా ముందుకు సాగుతుంది… ఇక మొత్తానికైతే భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఇండియాలోనే అతిపెద్ద డిజాస్టర్ గా మారడం దానిని ప్రేక్షకులు ఆదరించడం అనేది మరొక ఎత్తుగా మారింది. ఇక మొత్తానికైతే ఈ సినిమాకి వచ్చిన నష్టాలు కొంతవరకు కవర్ అయ్యే అవకాశం అయితే ఉన్నట్టుగా తెలుస్తోంది…