https://oktelugu.com/

కేసీఆర్ తో గేమ్స్ ఆడకు.. ఫ్యామిలీ మొత్తాన్ని దించేశాడు!

గత జీహెచ్ఎంసీ ఎన్నికలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల్లో పెట్టారు. గత పార్లమెంట్ ఎన్నికలను కొడుకుకే అప్పగించాడు. జీహెచ్ఎంసీలో నెగ్గుకొచ్చిన కేటీఆర్.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ‘సారూ.. కారు.. పదహారు’ను దక్కించుకోలేకపోయాడు. ఈ పక్క కాంగ్రెస్, ఆ పక్క బీజేపీ ఎత్తులకు చిత్తయ్యాడు. Also Read: జర్నలిస్టులకు.. కేసీఆర్ మళ్లీ వేసేశాడు.. ఇప్పుడు దుబ్బాకలో అట్టర్ ఫ్లాప్ అయ్యాక ఇక కేసీఆరే రంగంలోకి దిగాడు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై స్వయంగా వ్యూహరచన చేస్తున్నాడు. కొడుకు కేటీఆర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2020 / 10:05 AM IST
    Follow us on

    గత జీహెచ్ఎంసీ ఎన్నికలను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేతుల్లో పెట్టారు. గత పార్లమెంట్ ఎన్నికలను కొడుకుకే అప్పగించాడు. జీహెచ్ఎంసీలో నెగ్గుకొచ్చిన కేటీఆర్.. పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ‘సారూ.. కారు.. పదహారు’ను దక్కించుకోలేకపోయాడు. ఈ పక్క కాంగ్రెస్, ఆ పక్క బీజేపీ ఎత్తులకు చిత్తయ్యాడు.

    Also Read: జర్నలిస్టులకు.. కేసీఆర్ మళ్లీ వేసేశాడు..

    ఇప్పుడు దుబ్బాకలో అట్టర్ ఫ్లాప్ అయ్యాక ఇక కేసీఆరే రంగంలోకి దిగాడు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలపై స్వయంగా వ్యూహరచన చేస్తున్నాడు. కొడుకు కేటీఆర్ ను పక్కనపెట్టి అంతా తానై నిర్వహిస్తున్నాడు. అభ్యర్థుల ఖరారు.. ఎన్నికల వ్యూహాలు సహా అన్నింటిని చక్కబెడుతున్నాడు. ప్రచారానికి వస్తున్నాడు. ఎల్బీ స్టేడియంలో ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

    ట్విస్ట్ ఏంటంటే.. ఈసారి కేసీఆర్ సకుటుంబ సపరివారంగా జీహెచ్ఎంసీ ఎన్నికలను ఎదుర్కొంటున్నాడు. కూతురు కవితను జీహెచ్ఎంసీ ఎన్నికల కార్యక్షేత్రంలోకి దించాడు. ఇక ట్రబుల్ షూటర్ హరీష్ రావును సైతం కేసీఆర్ హైదరాబాద్ లో దించడం విశేషంగా మారింది. దుబ్బాకలో హరీష్ గెలిపించలేకపోయినా.. గ్రేటర్ లో మాత్రం ప్రభావం చూపగల నేత కావడంతోనే ఆయన అవసరాలు గుర్తించి రప్పించాడు.

    Also Read: ఒవైసీ సెక్యులరిజాన్ని గురించి తెలుసుకుందాం

    హరీష్ రావడం రావడమే సత్తా చాటాడు. గురువారం ఉదయం వెంగళ్ రావు నగర్‌ సిట్టింగ్‌ టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ కిలారి మనోహర్‌, రామచంద్రాపురం కార్పొరేటర్‌ అంజయ్య యాదవ్‌లు బీజేపీలో చేరారు. టీఆర్‌ఎస్‌ నుంచి టికెట్‌ ఇవ్వకపోవటంతో గురువారం బీజేపీలోకి జంప్ అయ్యారు. దీంతో వెంటనే మంత్రి హరీశ్ రావు రంగంలోకి దిగారు. అంజయ్య యాదవ్‌కు నచ్చ జెప్పి మళ్లీ సొంత గూటికి లాక్కొచ్చారు. ఈ పరిణామం బీజేపీ వర్గాలకు షాకింగ్ గా మారింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ఇక కవిత సైతం గాంధీనగర్ ఏరియాలో కార్పొరేటర్ల బాధ్యతను తీసుకున్నారు. ప్రతి మంత్రికి కొన్ని డివిజన్లను అప్పగించిన కేసీఆర్.. ఇప్పుడు గ్రేటర్ ఫైట్ ను హోరెత్తిస్తున్నారు. కేసీఆర్ స్కెచ్ గీశాక గురితప్పదంటారు. ఆయన గేమ్ మొదలుపెడితే ప్రత్యర్థులు సర్దుకోవాల్సిందేనంటారు. మరి ఫ్యామిలీని మొత్తం దించేసి కేసీఆర్ ఆడుతున్న గ్రేటర్ ఆటలో ఎవరు విజేతలనేది హైదరాబాదీలే తేల్చాల్సి ఉంటుంది. అప్పటివరకు వేచిచూడక తప్పదు మరి..