Kannappa Movie Review: శివుడి పరమ భక్తుడు అయిన కన్నప్ప (Kannappa) ఆధారంగా మంచు విష్ణు (Vishnu) తెరకెక్కించిన కన్నప్ప సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గత రెండు మూడు సంవత్సరాల నుంచి మంచు విష్ణు కన్నప్ప సినిమా కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. ఫైనల్ ఈ రోజు థియేటర్లోకి వచ్చిన ఈ సినిమా ఎలా ఉంది సగటు ప్రేక్షకుడిని మెప్పించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…
కథ
ఈ సినిమా కథ విషయానికి వస్తే అడవి ప్రాంతంలో నివసిస్తున్న కొంతమంది వ్యక్తులు వాళ్లకు వచ్చే ఇబ్బందుల నుంచి కాపాడాలని కొండ దేవతకి ప్రతి ఏడు ఎవరినో ఒకరిని బలిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఒకసారి తిన్నడి (మంచు విష్ణు) స్నేహితుడిని బలిస్తారు. దానివల్ల దేవుడంటే మంచివాడు, బలి కోరేవాడు కాదు అనుకునే తిన్నడు అప్పటినుంచి దేవుడిని నమ్మడం మానేస్తాడు. ఇక ఆ తర్వాత తన గూడెం ప్రజలకు వచ్చిన కష్టాలను తిన్నడు ఎలా తీర్చాడు. దేవుడు అంటేనే పడని తిన్నడు పరమశివుడి భక్తుడిగా మారి కన్నప్ప గా ఎలా మారాడు అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే ఈ సినిమా కథ కన్నప్ప జీవిత కథ ఆధారంగా తరికెక్కినప్పటికి అందులో కొంచెం కల్పితంగా రాసుకున్న కథ కూడా ఉంది. సినిమాటిక్ లిబర్టీ తీసుకొని ముందుకు నడిపించే ప్రయత్నం అయితే చేశారు. ఇక దర్శకుడు సైతం ఈ సినిమాని ఎమోషన్ పరంగా తగ్గకుండా ప్రేక్షకులను కట్టిపడేసే ఎమోషన్స్ తో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. మంచు విష్ణు (Vishnu) ఇంతకుముందు సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో కొంతవరకు బెటర్ పర్ఫామెన్స్ అయితే ఇచ్చే ప్రయత్నం చేశాడు. మొత్తానికైతే ఈ సినిమా కథని పర్ఫెక్ట్ గా స్క్రీన్ పైన ప్రజెంట్ చేసే ప్రయత్నం అయితే చేశారు.
సినిమాలోని కోర్ ఎమోషన్ ని ఎప్పటికప్పుడు ప్రేక్షకుడికి చూపిస్తూ అక్కడక్కడ కొన్ని ఎలివేషన్స్ కూడా ఇస్తు సినిమా మొత్తాన్ని ప్రేక్షకుడికి నచ్చే విధంగా తెరకెక్కించారు. ఫస్టాఫ్ లో వచ్చే కొన్ని సీన్లు చిరాకు పుట్టించినప్పటికి సెకండాఫ్ మాత్రం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేసే విధంగా ఉంది. ముఖ్యంగా ప్రభాస్ ఎంట్రీ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. ప్రభాస్ చెప్పే డైలాగులు సినిమా మొత్తానికి హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా క్లైమాక్స్ లో విష్ణు పర్ఫామెన్స్ కూడా బావుంది. అలాగే క్లైమాక్స్ సీన్ ని మలిచిన విధానం అద్భుతంగా ఉంది. దర్శకుడు పర్ఫెక్ట్ గా ఒక మైథలాజికల్ సినిమాని ఎలా తీస్తారో ఈ సినిమాని కూడా అదే టెంపో లో తీసి మెప్పించాడు…
ఇక అక్కడక్కడ కొన్ని సీన్లకు లాజిక్కులు అయితే లేవు. కానీ ఎమోషన్ తో సాగుతున్న సినిమా కాబట్టి ప్రేక్షకులు ఎవరు దాన్ని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు… ఇక ఫస్టాఫ్ లో వచ్చే లవ్ సాంగ్ అలాగే కొన్ని అనవసరమైన సీనులని ట్రిమ్ చేస్తే బాగుండేది. లెంత్ కూడా చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఆ లెంత్ కట్ చేసి ఉంటే ఇంకాస్త సినిమా గ్రిప్పింగ్ గా వచ్చుండేది. సీజీ వర్క్ కూడా అక్కడక్కడ పర్ఫెక్ట్ గా సెట్ అవలేదు. కొన్ని సీన్లు గ్రీన్ మ్యాట్ వేసి తీసినట్టుగా ఈజీగా తెలిసిపోతోంది…
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఇక ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో విష్ణు కొంతవరకు పర్లేదు అనిపించేలా నటించాడు. ఇంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో ఆయన కొంచెం బెటర్ పర్ఫామెన్స్ ఇవ్వడం అతని అభిమానులకు ఆనందాన్ని కలిగిస్తుంది. శివుడి క్యారెక్టర్ లో అక్షయ్ కుమార్ పర్ఫామెన్స్ అయితే బాగుంది. ఆయన చెప్పిన డైలాగులు కొంతవరకు డబ్బింగ్లో సింక్ అవ్వకపోయినా కూడా ఆ సీన్ ఎమోషన్ లో అవన్నీ పట్టించుకాకుండా చేశాయి. నిజానికి పార్వతి దేవిగా కాజల్ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఎంతవరకు నటించాలో అంతవరకే నటించి ఓవర్ యాక్టింగ్ లేకుండా చాలా బాగా చేసి మెప్పించింది…
ప్రభాస్ యాక్టింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని అయితే లేదు. మొత్తం సినిమాలో ఆయన కనిపించిన ఆ ఐదు నిమిషాలు ఆయన చెప్పిన డైలాగులు కూడా బాగా ఎలివేట్ అయ్యాయి… మోహన్ బాబు కూడా మహాదేవ శాస్త్రి పాత్రలో బాగా నటించి మెప్పించాడు. ఒకరకంగా ఆ పాత్రకు ప్రాణం పోశాడనే చెప్పాలి. కిరాతక పాత్రలో కనిపించి ఇంటర్వెల్ కి ముందు ఒక హై అయితే ఇచ్చాడు… శరత్ కుమార్ సైతం తండ్రి పాత్రలో ఒదిగిపోయి నటించి మెప్పించాడు… ఇక మిగతా పాత్రలు చేసిన ప్రతి ఒక్కరు వాళ్ళ పాత్రల పరిధి మేరకు ఓకే అనిపించారు…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ కొంతవరకు ప్లస్ అయింది. శివుడి మీద వచ్చే సాంగ్ హైలెట్ గా నిలిచింది. మిగతా సాంగ్స్ పెద్దగా ఎఫెక్టివ్ గా లేకపోయిన సినిమా చూస్తున్నంత సేపు ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయగలిగాయి. అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా బాగా కేర్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది… విజువల్స్ కూడా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాయి…
ప్లస్ పాయింట్స్
ప్రభాస్
విష్ణు యాక్టింగ్
సెకండాఫ్
మైనస్ పాయింట్స్
ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్
లాజిక్స్ లేకపోవడం
టెక్నికల్ వర్క్ అక్కడక్కడ సెట్ అవ్వలేదు…
రేటింగ్
ఈ మూవీకి మేమిచ్చే రేటింగ్ 2.75/5
