Family Man Season 3 Trailer Review: ఓటిటి లో అత్యంత పాపులారిటిని సంపాదించుకున్న సిరీస్ లలో ‘ద ఫ్యామిలీ మెన్’ సిరీస్ ఒకటి…ఇక సక్సెస్ ఫుల్ గా రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ సిరీస్ తాజాగా మూడో సీజన్ ను కూడా రిలీజ్ చేయడానికి సిద్ధమైంది. ఇక మొదటి రెండు సీజన్లలో సీక్రెట్ ఏజెంట్ గా పనిచేసిన శ్రీకాంత్ తివారీ ఇప్పుడు తన ఫ్యామిలీ ముందు తన చేసే జాబ్ ఏంటో రివిల్ చేశాడు. ఆయన ఎందుకు తన ఫ్యామిలీ ముందు ఓపెన్ అయ్యాడు అనేదే ఇప్పుడు అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది… మొదటి రెండు సీజన్స్ మాదిరిగానే ఈ సీజన్ లో కూడా కథ తీవ్రవాదం, ఇంటెలిజెన్స్ చుట్టూ తిరగబోతున్నట్టుగా తెలుస్తోంది. గత రెండు సీజన్లలో తను ఏం చేస్తున్నాడో ఫ్యామిలీకి తెలియకుండా సీక్రెట్ గా మెయింటైన్ చేసిన శ్రీకాంత్ తివారి తన ఫ్యామిలీ ముందు తను దేశం కోసం పోరాడే వీరుడినని ఓపెన్ అయ్యాడు. తనెవరో ఫ్యామిలీకి తెలిసింది కాబట్టి ఆయన ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని రిస్క్ లో పెట్టాడు. అలాగే ఎన్నో రిస్క్ ఆపరేషన్స్ చేసిన శ్రీకాంత్ తివారీ నాని విప్పుడు ఒక దేశ ద్రోహి గా చిత్రీకరించారు.
Also Read: ‘పెద్ది’ సినిమాకు జాన్వీ కపూర్ పెద్ద మైనస్ కానుందా..? హీరోయిన్ ని చూపించే విధానం అదేనా!
కాబట్టి ఆయన ఇప్పుడు తన ఫ్యామిలీని సేవ్ చేసుకుంటూ ఎలా పోరాటం చేశాడనేదే ఈ సీజన్ 3 లో చూపించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక కథ మొత్తం నార్త్, ఈస్ట్ స్టేట్లలో జరగబోతున్నట్టుగా తెలుస్తోంది… ట్రైలర్ ను బట్టి మనోజ్ బాజ్ పాయ్ మరోసారి తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అతని భార్యగా ప్రియమణి నటిస్తోంది.
ఇక ఉగ్రవాది మీద ఆయన ఎలా విరుచుకుపడబోతున్నాడు అనేదే సీజన్ 3 పాయింట్ గా తెలుస్తోంది…. ఇక తనను ఉగ్రవాదిగా ఎందుకు ప్రకటించారు అనేది తెలియాల్సి ఉంది. ఒక ట్రైలర్లో విజువల్స్ అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి. యాక్షన్ ఎపిసోడ్ హైలైట్ అయ్యే విధంగా కనిపిస్తున్నాయి…మొదటి రెండు సీజన్లను మించి ఈ మూడో సీజన్ ఉండబోతున్నట్టుగా మేకర్స్ చాలా కాన్ఫిడెంట్ ని వ్యక్తం చేస్తున్నారు…ఇక ఈ సీజన్ లో జైదీప్ ఆహ్లావత్ మెయిన్ విలన్ గా కనిపించబోతున్నాడు…
నిమ్రత్ కౌర్ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. సందీప్ కిషన్ ఇందులో భాగమైనప్పటికి ట్రైలర్ లో అతన్ని మాత్రం రివిల్ చేయలేదు… ఆయన పాత్రను ఎలా మలిచారు శ్రీకాంత్ తివారికి అతను ఎలా యూజ్ అవ్వబోతున్నాడు అనేది సస్పెన్స్ గా చూపించే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది… ఇక ఈ సీజన్ నవంబర్ 21వ తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది…
