https://oktelugu.com/

Tollywood Hero: ఈ చిన్ని కృష్ణుడు టాలీవుడ్ యంగ్ హీరో… మెగా హీరో ఫ్రెండ్, తెలిశాక ఆశ్చర్యపోతారు!

తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ హీరో రామ్ చరణ్ ఫ్రెండ్ కూడాను. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు.

Written By: , Updated On : April 20, 2024 / 02:54 PM IST
Sharwanand Childhood Pics

Sharwanand Childhood Pics

Follow us on

Tollywood Hero: చిన్ని కృష్ణుడు గెటప్ లో ఉన్న ఈ బాలుడు ప్రస్తుతం టాలీవుడ్ యంగ్ హీరో. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా పరిశ్రమలో అడుగుపట్టి ఓ స్థాయికి వెళ్ళాడు. చక్కని కథలు ఎంచుకుని అద్భుతమైన చిత్రాలు ఇచ్చాడు. లవ్ రొమాంటిక్, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో పాటు పొలిటికల్ థ్రిల్లర్స్ కూడా చేశాడు. తనకంటూ ఒక ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. ఈ హీరో రామ్ చరణ్ ఫ్రెండ్ కూడాను. ఇప్పటికే మీకు ఒక ఐడియా వచ్చి ఉండొచ్చు. అప్పటి ఈ బుడ్డోడు నేటి శర్వానంద్.

శర్వానంద్ కి ఎలాంటి సినిమా నేపథ్యం లేదు. హీరో కావాలనే మక్కువతో పరిశ్రమలో అడుగుపెట్టాడు. మొదట్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. యువసేన మూవీతో శర్వానంద్ కి గుర్తింపు వచ్చింది. గమ్యం లో మంచి నటన కనబరిచి టాలీవుడ్ మేకర్స్ దృష్టిలో పడ్డాడు. దర్శకుడు క్రిష్ తెరకెక్కించిన గమ్యం మూవీ సూపర్ హిట్ అందుకుంది. మరో హీరోగా అల్లరి నరేష్ నటించాడు.

దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించిన ప్రస్థానం శర్వానంద్ కెరీర్లో గొప్ప చిత్రంగా ఉంది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ విమర్శకుల ప్రసంశలు అందుకుంది. శర్వానంద్ కెరీర్లో ఫస్ట్ కమర్షియల్ హిట్ అంటే.. రన్ రాజా రన్. సాహో ఫేమ్ సుజీత్ ఈ చిత్ర దర్శకుడు. అద్భుతమైన స్క్రీన్ ప్లే తో రన్ రాజా రన్ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో పాటు శర్వానంద్ కి యూత్ లో ఇమేజ్ క్రియేట్ చేసింది.

శతమానం భవతి, మహానుభావుడు వంటి సూపర్ హిట్స్ శర్వానంద్ ని టైర్ టు హీరోల జాబితాలో చేర్చాయి. ఈ మధ్య శర్వానంద్ సరైన హిట్ లేక అల్లాడుతున్నారు. ఆయన పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నా సక్సెస్ కావడం లేదు. త్వరలో శర్వానంద్ మనమే అనే చిత్రంతో ప్రేక్షకులను పలకరించనున్నాడు. కృతి శెట్టి ఆయనకు జంటగా నటిస్తుంది. గత ఏడాది రక్షిత రెడ్డి అనే యువతిని శర్వానంద్ వివాహం చేసుకున్నాడు. రామ్ చరణ్-శర్వానంద్ క్లాస్ మేట్స్ కాగా మంచి అనుబంధం ఉంది. శర్వానంద్ చిన్న హీరో అయినప్పటికీ వారిది బాగా రిచ్ ఫ్యామిలీ.