Homeఎంటర్టైన్మెంట్Ram Charan Peddi: రామ్ చరణ్ పెద్ది సినిమాను చిరంజీవి చూశాడా..? ఆయన రియాక్షన్ ఏంటంటే..?

Ram Charan Peddi: రామ్ చరణ్ పెద్ది సినిమాను చిరంజీవి చూశాడా..? ఆయన రియాక్షన్ ఏంటంటే..?

Ram Charan Peddi: రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మొదట మార్చి 27వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికి సినిమా షూటింగ్ అనుకున్న సమయానికి పూర్తవ్వలేదు దాంతో సినిమాను పోస్ట్ పోన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏప్రిల్ 30వ తేదీన ఈ సినిమా అంగరంగ వైభవంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే విషయాన్ని అయితే చాలా స్పష్టంగా తెలియజేశారు. ఇక మొత్తానికైతే ఈ సినిమాతో అటు రామ్ చరణ్, ఇటు బుచ్చిబాబు ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు అనేది తెలియాల్సి ఉంది… ప్రస్తుతం రామ్ చరణ్ కి సాలిడ్ హిట్టయితే అవసరం ఉంది. మరి దానికోసమే ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అయితే రీసెంట్ గా ఈ సినిమా రఫ్ ఫుటేజ్ ను చిరంజీవి చూశారట…

ఆ పుటెజ్ మీద చిరంజీవి కొంతవరకు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నప్పటికి కొన్ని సన్నివేశాలను మార్చమని వాళ్ళకి సలహాలైతే ఇచ్చినట్టుగా తెలుస్తుంది. తన సలహా మేరకు కొన్ని సీన్స్ ను తీసేస్తారా? లేదంటే దానికి ఇంకాస్త బెటర్మెంట్ ని జోడించి స్క్రీన్ మీద ప్రజెంట్ చేస్తారా అనే విషయం తెలియాల్సి ఉంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి జడ్జిమెంట్ బాగుంటుంది. ఎందుకంటే ఇప్పటికే ఆయన 150 సినిమాలను చేశాడు. 50 సంవత్సరాలకు పైన సినిమా ఇండస్ట్రీలో ఉంటున్నాడు కాబట్టి సగటు ప్రేక్షకులు మాస్ హీరో నుంచి ఏం కోరుకుంటారో తనకు బాగా తెలుసు… అందువల్లే ఆయన జడ్జిమెంట్ బాగుంటుందని దర్శక నిర్మాతలు సైతం చిరంజీవి చెప్పినట్టుగా చేస్తున్నారు…

రామ్ చరణ్ సైతం ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. గత సంవత్సరం శంకర్ డైరెక్షన్ లో చేసిన ‘గేమ్ చేంజర్’ సినిమాతో ప్రేక్షకులను నిరాశపర్చినప్పటికి ఈ సినిమా మాత్రం సూపర్ సక్సెస్ ని సాధిస్తుందనే కాన్ఫిడెంట్ తో రామ్ చరణ్ ఉండటం విశేషం…ఇక ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా మారుతుందా? లేదా అనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version