https://oktelugu.com/

Tillu Square – Family Star : ఓటీటీలో టిల్లు స్క్వేర్, ఫ్యామిలీ స్టార్… ఎప్పుడు? ఎక్కడ చూడొచ్చు? ఇంట్రెస్టింగ్ డిటైల్స్!

విజయ్ దేవరకొండకు జంటగా మృణాల్ ఠాకూర్ నటించింది. గతంలో విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. ఈసారి ఈ కాంబో ఫెయిల్ అయ్యింది.

Written By:
  • NARESH
  • , Updated On : April 25, 2024 / 09:47 PM IST

    Tillu Square and Family Star movies in OTT

    Follow us on

    Tillu Square – Family Star : ఈ వారం ఓటీటీలో రెండు క్రేజీ మూవీస్ స్ట్రీమ్ కానున్నాయి. దాంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందులో ఒకటి టిల్లు స్క్వేర్ కాగా, మరొకటి ఫ్యామిలీ స్టార్. సిద్ధూ జొన్నలగడ్డ హీరోగా నటించిన టిల్లు స్క్వేర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. 2022లో విడుదలైన డీజే టిల్లు చిత్రానికి ఇది సీక్వెల్. డీజే టిల్లు కి మించిన ఆదరణ టిల్లు స్క్వేర్ చిత్రానికి దక్కింది. ఈ చిత్రం వరల్డ్ వైడ్ రూ. 125 కోట్ల వసూళ్లు రాబట్టి ట్రేడ్ వర్గాలను షాక్ కి గురి చేసింది. యూఎస్ లో టిల్లు స్క్వేర్ $ 3 మిలియన్ వసూళ్లు రాబట్టడం విశేషం. ఇది స్టార్ హీరోలకు కూడా కష్టమైన ఫిగర్.

    టిల్లు స్క్వేర్ చిత్రంతో సిద్ధూ జొన్నలగడ్డ ఇమేజ్ పెరిగింది. టైర్ టు హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. మార్చి 29న విడుదలైన టిల్లు స్క్వేర్ నెల రోజులు గడవక ముందే ఓటీటీలోకి వచ్చేస్తుంది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం థియేటర్స్ లో సందడి ముగియక ముందే స్ట్రీమింగ్ కి సిద్ధమైంది. టిల్లు స్క్వేర్ డిజిటల్ రైట్స్ ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ నెట్ఫ్లిక్స్ కొనుగోలు చేసింది. ఏప్రిల్ 26 నుండి టిల్లు స్క్వేర్ స్ట్రీమ్ కానుంది.

    మాలిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటించింది. మరొక యూత్ఫుల్ ఎంటర్టైనర్ ఫ్యామిలీ స్టార్ సైతం స్ట్రీమింగ్ కి రెడీ అయ్యింది. ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రాగా మూడు వారాల్లోనే డిజిటల్ రిలీజ్ కి సిద్ధం చేశారు. కారణం… ఫ్యామిలీ స్టార్ ఆశించిన స్థాయిలో ఆడలేదు. మొదటి షో నుండే నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దాంతో ఓటీటీ లో విడుదల చేస్తున్నారు.

    ఫ్యామిలీ స్టార్ సైతం ఏప్రిల్ 26 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఫ్యామిలీ స్టార్ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ దక్కించుకుంది. ఫ్యామిలీ స్టార్ చిత్రానికి పరశురామ్ దర్శకుడు. దిల్ రాజు నిర్మించాడు. విజయ్ దేవరకొండకు జంటగా మృణాల్ ఠాకూర్ నటించింది. గతంలో విజయ్ దేవరకొండ-మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్ కొట్టిన విషయం తెలిసిందే. ఈసారి ఈ కాంబో ఫెయిల్ అయ్యింది.