https://oktelugu.com/

Photo Story : ఈ బుడ్డోడు ఇప్పుడు పాన్ ఇండియా హీరో.. ఎవరో చెప్పుకోండి..

ఈ సందర్భంగా ఆయనకు సంబందించిన చిన్న నాటి ఫొటో ఒకటి బయట రిలీజ్ అయింది. అందులో ఉన్న క్యూట్ గా ఉన్నది విజయ్ దేవరకొండనే. 

Written By:
  • Srinivas
  • , Updated On : May 11, 2023 / 02:18 PM IST
    Follow us on

    Photo Story : టాలీవుడ్ ఇండస్ట్రీలో స్వయం శక్తితో ఎదిగిన వాళ్లు చాలామందే ఉన్నారు. చిన్న అవకాశంతో పెద్ద స్టార్లుగా మారారు. అయితే కొన్ని సినిమాలు నిరాశపరచినా వారి స్టార్ డం మాత్రం తగ్గదు. ఉదాహరణకు పవన్ కల్యాణ్ కు ఇండస్ట్రీలోకి వచ్చి దశాబ్దాలు గడిచిన ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ ఆయన సినిమా వస్తే పండుగ చేసుకునే ఫ్యాన్స్ ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఆయన రేంజ్ లోనే మరోహీరోకు స్టార్ డం వచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన నటించి కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ అయ్యారు. ఆ తరువాత కొన్ని నిరాశ పరిచినా.. యూత్ లో ఆ హీరోపై ఉన్న క్రేజ్ తగ్గడం లేదు. దీంతో ఆయననుపవన్ కల్యాణ్ తోపోలుస్తున్నారు. ఇంతకీ ఎవరా హీరో అనే మీ డౌట్ కదా..

    మొదట్లో ఆయన హీరో అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడు. కానీ ఎంత ప్రయత్నించినా అవకాశాలు రాలేదు. చివరకు డైరెక్టర్ అవుదామని అసిస్టెంట్ గా చేరాడు. ఆ తరువాత కొన్నిసీరియల్స్ తీశాడు. కానీ వెండితెరపై కనపించాలన్న ఆశ ఆయనలో చావలేదు. దీంతో ఏ చిన్న అవకాశం వచ్చినా వదులుకోవద్దని డిసైడ్ అయ్యారు. దీంతో ఓ సినిమాలో చిన్న పాత్ర రావడంతో వెంటనే ఒప్పేసుకున్నాడు. అప్పటికే హీరో రేంజ్ లో ఉన్న చిన్న నిడివి పాత్ర అయినా ఒప్పుకోవడంతో ఆయనకు సినిమాలపై ఉన్న ఇంట్రెస్ట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఆయన ఎవరో కాదు విజయ్ దేవరకొండ.

    రౌడీ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ డెబ్యూ సినిమాపై ఫ్యాన్స్ లో కొంత కన్ప్యూజన్ ఉంది. ఆయన మొదటి సినిమా రవిబాబు తీసిన ‘నువ్విలా’ అని చాలా మందికి తెలియదు. ఇందులో చిన్న పాత్రలో విజయ్ దేవరకొండ కనిపిస్తాడు. ఆ తరువాత శేఖర్ కమ్ముల తీసిన ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ సినిమాలో సైడ్ హీరోగా చేశారు. ఇలా ఏ పాత్ర ఇచ్చిన చేయడానికి రెడీగా ఉండడమే ఆయనకు అవకాశాలు తెచ్చిపెట్టింది. ఆ తరువాత తరుణ్ బాస్కర్ తీసిన ‘పెళ్లి చూపులు’తో మెయిన్ హీరోగా మారాడు విజయ్. ఇక ‘అర్జున్ రెడ్డి’ ఏ రేంజ్ లో హిట్టు తెచ్చిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

    సినిమాలపై ఉన్న ఆసక్తితో నిర్మాతల చుట్టూ తిరిగాడట విజయ్ దేవరకొండ. ప్రస్తుతం ఆయనతో సినిమాలు తీయడానికి నిర్మాతలు వెంటపడుతున్నారు. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘లైగర్’ సినిమాతో విజయ్ పాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. ఇటీవల విజయ్ బర్త్ డేను పురస్కరించుకొని ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు సంబందించిన చిన్న నాటి ఫొటో ఒకటి బయట రిలీజ్ అయింది. అందులో ఉన్న క్యూట్ గా ఉన్నది విజయ్ దేవరకొండనే.