https://oktelugu.com/

Pokiri: ‘పోకిరి’ అంత పెద్ద హిట్ ఎలా అయిందని ఎవరికైనా డౌట్ వచ్చిందా? కారణాలు ఇవే..

Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ను రెండోసారి టర్న్ చేసింది ‘పోకిరి’. అప్పటి వరకు మహేష్ బాబు లవర్ బాయ్ హీరో. ‘అతడు’ లాంటి సినిమాలో కొంచెం యాక్షన్ చూపించినా మాస్ హీరో అనిపించుకోలేకపోయాడు. అయితే డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘పోకిరి’లో మహేష్ యాంగిల్స్ కంప్లీట్ చేంజ్ చేశాడు. ఇందులో మాఫియా మేన్ గా..పోలీస్ గా రెండు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా తెలుగు […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 11, 2023 / 02:10 PM IST
    Follow us on

    Pokiri: సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ ను రెండోసారి టర్న్ చేసింది ‘పోకిరి’. అప్పటి వరకు మహేష్ బాబు లవర్ బాయ్ హీరో. ‘అతడు’ లాంటి సినిమాలో కొంచెం యాక్షన్ చూపించినా మాస్ హీరో అనిపించుకోలేకపోయాడు. అయితే డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ డైరెక్షన్లో వచ్చిన ‘పోకిరి’లో మహేష్ యాంగిల్స్ కంప్లీట్ చేంజ్ చేశాడు. ఇందులో మాఫియా మేన్ గా..పోలీస్ గా రెండు పాత్రలో కనిపించి ఆకట్టుకున్నారు. అయితే ఈ సినిమా తెలుగు ఇండస్ట్రీలో రికార్డు తిరగేసిందని కథలుగా ఇప్పటికీ చెప్పకుంటున్నారు. ఇంతకీ ‘పోకిరి’ సక్సెస్ కావడానికి అసలైన కారణాలేంటి? వేటి వల్ల ఈ మూవీకి ఇమేజ్ వచ్చింది?

    సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి 2006 ఏప్రిల్ 28న థియేటర్లోకి వచ్చింది. ఈ సమయంలో వరుసగా మాస్ మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. బాలయ్య నటించి వీరభద్ర, పవన్ కల్యాణ్ నటించి ‘బంగారం, ప్రభాస్ నటించి పౌర్ణమిలు థియేటర్లోకి వచ్చాయి. అయితే వీటిని ప్రేక్షకులు ఆదరించలేదు. ఆయా సినిమాల్లో నటించింది స్టార్ హీరోలైనా సినిమాలు ఆకట్టుకోకపోవడంతో అవి డిజాస్టర్ గా నిలిచాయి. ఇదే సమయంలో పోకిరి రిలీజ్ కావడంతో ప్రేక్షకులు ఈ మూవీ వైపు కు వెళ్లారు. ఈ సినిమా హిట్టు కావడానికి ఇదో కారణం చెప్పుకుంటున్నారు.

    మహేష్ బాబు అప్పటి వరకు లవర్ బాయ్ గానే సినిమాల్లో నటించారు. అతడు లాంటి సినిమాలో కాస్త యాక్షన్ చూపించినా ఫుల్ టైం మాస్ హీరో అనిపించుకోలేకపోయారు. పోకిరిలో మాత్రం మహేష్ యాంగిల్ పూర్తిగా ఛేంజ్ చేశారు. ప్రతీసారి జలుబు చేసినట్లుగా.. నటించడం.. అచ్చం పోకిరిలాగా గెటప్ తదితర కారణాలు మహేష్ ను కొత్త లుక్ లో చూపించాయి. దీంతో ఫ్యాన్స్ సైతం మహేష్ ను ఇలా చూపించడంతో సందడి చేశారు. ఈ సినిమా తరువాత మహేష్ మాస్ హీరో అని పేరు నిలబెట్టుకున్నాడు.

    ఇందులో నటించి న ఇలియానా అప్పటి వరకు కొన్ని సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. మంచి హిట్టుకోసం చూస్తున్న ఈ భామకు పోకిరిలో నటించే చాన్స్ రావడంతో ఆమె ఈ సినిమా కోసం తెగ కష్టపడ్డారు. అందం, అభినయంతో ఆకట్టుకోవడంతో ప్రేక్షకులు ఆమె అందానికి ఫిదా అయ్యారు. ఫస్ట్ టైం ఇందులో ట్రెడిషనల్ తో పాటు హాట్ గా కనిపించిన ఇలియానతో కూడా సినిమా సక్సెస్ అయిందని అంటున్నారు.

    ఇక డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్  వద్ద ఎప్పుడూ వైవిద్యమైన కథలే ఉంటాయి. కానీ అందుకు తగ్గట్టుగా హీరోలు దొరకరని ఆయన ఫ్యాన్స్ అంటుంటారు. ఇలాంటి సమయంలో మహేష్ అయనకు మంచి హీరోగా కనిపించాడు. ఆయనకు ఈ కథను చెప్పడం.. వెంటనే ఒప్పేసుకోవడం.. అన్నీ కలిసొచ్చాయి. ఎలాంటి వారితోనైనా తన కథతో మాస్ హీరోను తయారు చేస్తానని పూరిజగన్నాథ్ ఈ సినిమాతో నిరూపించాడు.  ఇలాంటి కారణాల వల్లనే సినిమా సక్సెస్ అయిందని సోషల్ మీడియాలోచర్చించుకుంటున్నారు.