Rajasaab: ఇండస్ట్రీ లో ఉన్న చాలామంది హీరోలు వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ళకంటూ ఒక ప్రత్యేకతని ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా ముందుకు దూసుకెళ్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఎక్కువ గా హీరోలు ఒక్క స్ట్రాటజీ ని నమ్ముకొని అలాంటి సినిమాలు తీస్తూ ముందుకు కదులుతూ ఉంటారు. అందులో కొంతమంది సక్సెస్ అయితే మరి కొంతమంది ఫెయిల్యూర్ గా మిగిలిపోతూ ఉంటారు.
ఇక ముఖ్యంగా స్టార్ హీరోలుగా గుర్తింపు పొందిన నటులు మాత్రం వాళ్ళకంటూ మంచి ఇమేజ్ ని ఏర్పాటు చేసుకొని కొన్ని జానర్స్ లో సినిమాలు చేస్తూ వెళ్తారు. అలా చేయడం వల్ల కొన్ని కేటగిరీ సినిమాలకి వాళ్లు బ్రాండ్ అంబాసాడర్ గా మారుతారు. ఇక అందులో ముఖ్యంగా వెంకటేష్ ఒకరు. ఈయన కామెడీ యాక్షన్ సినిమాలు ఎక్కువగా చేస్తూ ప్రేక్షకుల్లో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వెంకటేష్ చాలామంది దర్శకులతో సినిమాలు చేశారు. అయితే మారుతి డైరెక్షన్ లో చేసిన బాబు బంగారం సినిమా పెద్దగా ఆడలేదు.
దాంతో వీళ్ళ కాంబినేషన్ కి పెద్దగా గుర్తింపు అయితే రాలేదు. ఇక అందులో భాగంగానే మరొకసారి వీళ్ళ కాంబినేషన్ అనేది రిపీట్ అవ్వలేదు కొత్త కొత్త డైరెక్టర్లతో వెంకటేష్ సినిమాలు చేసుకుంటూ వెళ్తుంటే, మారుతి మాత్రం డిఫరెంట్ టైప్ లో సినిమాలను చేసుకుంటు ముందుకు కదులుతున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ప్రస్తుతం మారుతి ప్రభాస్ ని హీరో గా పెట్టి సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ ని మొదట వెంకటేష్ కి వినిపించాడట.
ఇక వెంకటేష్ ఆ సినిమా స్క్రిప్ట్ విని తన అభిప్రాయం ఏంటో చెప్పకుండానే దాన్ని హోల్డ్ లో పెట్టాడట, దాంతో వెంకటేష్ వైఖరి నచ్చక మారుతి ఆ కథని ప్రభాస్ కి చెప్పి ఆయనతో రాజాసాబ్ అనే పేరు తో సినిమా చేస్తున్నాడు. మరి వెంకటేష్ మారుతిని రిజక్ట్ చేయడానికి కారణం ఏంటి అంటే ఇంతకుముందు ఆయన తీసిన బాబు బంగారం సినిమా పెద్దగా ఆకట్టుకోకపోవడమే అని మరి కొంతమంది చెప్తున్నారు. మరి వెంకటేష్ ని కాదని మారుతి ఈ సినిమా తో హిట్ కొట్టి చూపిస్తారా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…