Bigg Boss Telugu 8: ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన కంటెస్టెంట్స్ లో మొదటి మూడు వారాలు చాలా స్ట్రాంగ్ గా అనిపించినా కంటెస్టెంట్ కిరాక్ సీత. నిజంగా ఈమె మొదటి మూడు వారాలు కిరాక్ గా గేమ్ ఆడి, నాగార్జునతో కూడ కిరాక్ సీత అని అనిపించుకుంది. అయితే అతిగా ఎమోషనల్ అవ్వడం ఈమెకు పెద్ద మైనస్ అయ్యిందా అంటే అయ్యింది అనే చెప్పాలి. ఎప్పుడైతే ఆమె తన స్నేహితురాలైన నైనికా ని నామినేట్ చేసి, ఆమె ఎలిమినేట్ అయ్యినప్పుడు ఏడ్చిందో, అప్పుడే ఈమె అసలు రంగు ప్రేక్షకుల ముందు బయటపడింది. అసలు నామినేషన్ చేయడం అంటేనే ఒక కంటెస్టెంట్ ని హౌస్ నుండి బయటకి పంపడం. అలాంటిది ఈమె తన స్నేహితురాలిని బయటకి పంపేందుకు నామినేట్ చేయడం ఎందుకు?, ఆమె ఎలిమినేట్ అయ్యాక ఏడవడం ఎందుకు, ఇదంతా డ్రామా లాగా అనిపిస్తుందని ప్రేక్షకులకు అనిపించింది.
ఈమె కిరాక్ సీత కాదు, చిరాక్ సీత అని బయట నెటిజెన్స్ సోషల్ మీడియా లో సరికొత్త ట్యాగ్ ని కూడా ఇచ్చారు. దీంతో ఆమె గ్రాఫ్ అమాంతం తగ్గిపోయింది. అంతే కాకుండా చీఫ్ అవ్వడం కూడా సీత కి పెద్ద మైనస్ అయ్యింది అనే చెప్పాలి. ఆమె కేవలం ‘బేబీ’ చిత్రం ద్వారా మాత్రమే ఆడియన్స్ కి సుపరిచితం అయ్యింది, పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఏమి లేదు. ఆమెకి మొదటి మూడు వారాలు బలమైన ఓటింగ్ పడింది అంటే అందుకు కారణం, ఆమె అద్భుతంగా గేమ్ ఆడడం వల్లే, కానీ చీఫ్ అయ్యాక ఆమె గేమ్స్ ఆడలేకపోయింది. ఇక్కడే ఆమె గ్రాఫ్ పాఠంలోకి పడిపోయింది. ఆ తర్వాత ఈమె మణికంఠ, ప్రేరణ పై వ్యక్తిగతంగా అసూయ పెంచుకోవడం వంటివి కూడా ఆడియన్స్ బాగా గమనించారు. అందుకే నామినేషన్స్ లోకి రాగానే ఆమెను కిందకు తోసేశారు. దీంతో ఈ ఈరోజు ప్రసారం అవ్వబోయే ఎపిసోడ్ లో ఆమె బయటకు వచ్చేసింది. అయితే ఆరు వారాలు ఉన్నందుకు ఈమెకి బిగ్ బాస్ టీం ఇచ్చిన రెమ్యూనరేషన్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ అయ్యింది.
వారానికి రెండు లక్షల చొప్పున ఆమె ఆరు వారాలకు గానూ 12 లక్షల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకున్నట్టు తెలుస్తుంది. ఇది నిజంగా సీత క్యాలిబర్ కి చాలా తక్కువ అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె అన్ని విధాలుగా విష్ణు ప్రియ కంటే బెస్ట్ కంటెస్టెంట్ అని చెప్పొచ్చు. విష్ణు ప్రియ కి ఒక్కో వారానికి నాలుగు లక్షలకు పైగా రెమ్యూనరేషన్ ఇస్తుంది బిగ్ బాస్ టీం. అంటే సీత కంటే రెండు రెట్లు ఎక్కువ అన్నమాట. విష్ణు ప్రియ హౌస్ లోకి అడుగుపెట్టే ముందే టాప్ సెలబ్రిటీ అవ్వడం, ఆమెకు ఫ్యాన్ బేస్ ఉండడం వల్లే ఈ స్థాయి రెమ్యూనరేషన్ ఇచ్చారని, సీతకు ఫ్యాన్ బేస్ లేకపోవడంతో ఆమెకు తక్కువ రెమ్యూనరేషన్ కి ఒప్పించారని సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.