https://oktelugu.com/

Bigg Boss Telugu 8: టేస్టీ తేజా,గౌతమ్ ని టార్గెట్ చేసిన ఓజీ క్లాన్..సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళేది ఎవరు?

హౌస్ మేట్స్ అందరూ గౌతమ్ కృష్ణ ని, టేస్టీ తేజా ని చాలా సాఫ్ట్ గా టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న ఎపిసోడ్ ముగిసే ముందు నాగార్జున హౌస్ మేట్స్ అందరినీ యాక్షన్ రూమ్ లోకి రమ్మని చెప్తాడు. అక్కడ హౌస్ మేట్స్ ముఖాలతో ఉన్నటువంటి లగ్యేజ్ లు ఉంటాయి. ఎదురుగా ఎగ్జిట్ బోర్డు తో ఒక డోర్ కూడా ఉంటుంది

Written By:
  • Vicky
  • , Updated On : October 13, 2024 / 09:06 AM IST

    Bigg Boss Telugu 8

    Follow us on

    Bigg Boss Telugu 8:  హౌస్ మేట్స్ నిన్న మొన్నటి వరకు మణికంఠ ని బాగా టార్గెట్ చేసినట్టు అనిపించింది. కానీ ఇప్పుడు మాత్రం అందరూ గౌతమ్ కృష్ణ ని, టేస్టీ తేజా ని చాలా సాఫ్ట్ గా టార్గెట్ చేసినట్టుగా అనిపించింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే నిన్న ఎపిసోడ్ ముగిసే ముందు నాగార్జున హౌస్ మేట్స్ అందరినీ యాక్షన్ రూమ్ లోకి రమ్మని చెప్తాడు. అక్కడ హౌస్ మేట్స్ ముఖాలతో ఉన్నటువంటి లగ్యేజ్ లు ఉంటాయి. ఎదురుగా ఎగ్జిట్ బోర్డు తో ఒక డోర్ కూడా ఉంటుంది. ఎవరైతే బిగ్ బాస్ హౌస్ లో ఉండేందుకు అర్హులు కారో, వాళ్ళ లగ్యేజ్ ని ఎగ్జిట్ డోర్ వద్ద పెట్టండి అని నాగార్జున అంటాడు. ముందుగా రాయల్ క్లాన్ సభ్యులను అడుగుతారు. రాయల్ క్లాన్ సభ్యులు మణికంఠ, నిఖిల్, విష్ణు ప్రియ, ప్రేరణ మరియు పృథ్వీ వంటి వారు ఈ హౌస్ లో ఉండేందుకు అర్హులు కాదని వాళ్ళ లగ్యేజ్ ని ఎగ్జిట్ డోర్ వద్ద పెడుతారు. ఎక్కువ ఓట్లు పృథ్వీ కి పడడం తో అతన్ని హౌస్ లో ఉండేందుకు అర్హుడు కాదని నాగార్జున నిర్ణయిస్తాడు.

    అలాగే ఓజీ క్లాన్ సభ్యులను రాయల్ క్లాన్ లో మీకు అనర్హులు ఎవరు అనిపిస్తున్నారో వాళ్ళ లగ్యేజ్ ని ఎగ్జిట్ డోర్ వద్ద పెట్టమని నాగార్జున చెప్పగా, అందరూ ఎక్కువగా టేస్టీ తేజా పేరుని గౌతమ్ పేరు ని చెప్తారు. దీంతో రాయల్ క్లాన్ నుండి వీళ్ళిద్దరిని అనర్హుల క్యాటగిరీలోకి చేరుస్తాడు నాగార్జున. అలా ఈ ప్రక్రియ ముగుస్తుంది. వీళ్ళ ముగ్గురిని ఏమి చేయాలో బిగ్ బాస్ నిర్ణయిస్తాడు అని నాగార్జున చెప్పి, ఎపిసోడ్ ని ముగిస్తాడు. అయితే హౌస్ లో అందరూ గౌతమ్ ని టార్గెట్ చేయడం ఎంత వరకు కరెక్ట్ అని ప్రేక్షకులకు అనిపించింది. గౌతమ్ అందరితో బాగానే ఉన్నాడు, హౌస్ లో టాస్క్ వచ్చినప్పుడల్లా బాగానే ఆడాడు కదా, ఎందుకు అతన్ని టార్గెట్ చేసినట్టు అనిపించింది. అయితే సీజన్ 7 లో చూసిన గౌతమ్ కి, ఇప్పుడు చూస్తున్న గౌతమ్ కి చాలా తేడా ఉంది. లోపల హౌస్ మేట్స్ కి కూడా అదే అనిపించి ఆయన్ని ఎంచుకున్నారు అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

    అయితే మరికొంత మంది మాత్రం గౌతమ్ విన్నర్ మెటీరియల్, ఇతన్ని ఇప్పటి నుండి టార్గెట్ చేసి బయటకి పంపిస్తేనే వర్కౌట్ అవుతుందని కంటెస్టెంట్స్ గేమ్ ప్లాన్ అన్నట్టుగా నెటిజెన్స్ అనుకుంటున్నారు. ఇక టేస్టీ తేజా ని నామినేట్ చేయడంలో న్యాయం ఉంది, ఎందుకంటే ఈయన పెద్దగా టాస్కులు బాగా ఆడలేదు, అలాగే ఎంటర్టైన్మెంట్ కూడా ఆశించిన స్థాయిలో ఇవ్వలేదు. కాబట్టి హౌస్ మేట్స్ అతన్ని ఎంచుకోవడం లో తప్పు లేదు. కానీ రాయల్ క్లాన్ విష్ణు ప్రియ ని కాకుండా పృథ్వీ ని ఎక్కువగా నామినేట్ చేయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే అనర్హులుగా ఎంపిక కాబడ్డ ఈ ముగ్గురిని బిగ్ బాస్ ఏమి చేయబోతున్నాడు?, వీరిలో ఎవరో ఒకరిని సీక్రెట్ రూమ్ లోకి పంపబోతున్నారా? అనేది ఈరోజు ఎపిసోడ్ లో తెలుస్తుంది.