సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే నైపుణ్యంతో పాటు అదృష్టం కూడా ఉండాలని చెప్పవచ్చు. చాలామందికి నటనా నైపుణ్యం ఉన్న వారికి అవకాశాలు రాక ఎంతో సతమతమవుతుంటారు. అయితే కొందరికి ఇండస్ట్రీలో అవకాశాలు వస్తున్నప్పటికీ ఇండస్ట్రీలో ముందుకు రావడం తెలియక సతమతమవుతుంటారు.ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలోకి సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చే వారసులు చాలా ఈజీగా ఇండస్ట్రీలోకి అడుగు పెడతారు.ఇంతటి సినీ నేపథ్యం ఉన్న కుటుంబం అయినా కూడా వారికి టాలెంట్ లేకపోతే ప్రేక్షకులు ఎంతో సున్నితంగా తిరస్కరిస్తారు. అలా తిరస్కరింపబడిన హీరోలు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారిలో అక్కినేని హీరో ఒకరు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా, ఆయన మనవడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోలలో హీరో సుశాంత్ ఒకరు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి కాళిదాస్ అనే సినిమా ద్వారా అడుగుపెట్టారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఈ క్రమంలోని అతను కరెంట్, అడ్డా వంటి చిత్రాలలో నటించారు. అయితే సుశాంత్ నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను ఏమాత్రం సందడి చేయలేకపోయాయి.
ఇలా ఎంతో పేరున్న కుటుంబం నుంచి వచ్చిన హీరో కావడంతో ఆయనకు అవకాశాలు వస్తున్నప్పటికీ గత కొద్దిరోజుల నుంచి సుశాంత్ విజయాలను అందుకోకపోవడానికి అసలైన కారణం ఉందని తెలుస్తోంది. సుశాంత్ కు ఎంతో మంది దర్శక నిర్మాతలు అద్భుతమైన కథలను వినిపించినప్పటికీ తనకు నచ్చిన పాత్ర రాలేదంటూ వాటిని తిరస్కరించేవారు. ఇలా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను సుశాంత్ వదులుకున్నట్టు తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ హీరో కథలను ఎంపిక చేసుకోవడంలో సతమతమవుతున్నారని, ఈ సమస్య కారణంగానే తాను ఇప్పటివరకు మంచి హిట్ సినిమాలను అందుకోలేక పోతున్నారని చెప్పవచ్చు.మరి ఈయనకు నచ్చిన పాత్ర ఎప్పుడు వస్తుందో ఈయన ఎప్పుడు విజయవంతమైన సినిమాల్లో నటిస్తారో వేచిచూడాలి.