https://oktelugu.com/

Bigg Boss Elimination: బిగ్ బాస్ నుంచి హాట్ ‘సరయు’ ఎలిమినేషన్ కు కారణమిదే?.. 3 తప్పులివే?

Bigg Boss Elimination: బిగ్ బాస్ మొదలైంది. తొలి వారం కూడా గడిచిపోయింది. తొలి వారం ఎలిమినేసన్ లో హాట్ బ్యూటీ సరయు Sarayu() ఎలిమినేట్ కావడం జరిగిపోయింది. బిగ్ బాస్ లోకి 19 మందితోపాటు ఎంట్రీ ఇచ్చింది కంటెస్టెంట్ సరయు. 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ చానెల్ లో ‘బూతుల రాణి’గా పేరొందిన ఈమె బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సరయు అంటేనే బూతులు అన్నట్టుగా ఫేమస్ అయ్యింది. అయితే బిగ్ బాస్ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 13, 2021 / 11:19 AM IST
    Follow us on

    Bigg Boss Elimination: బిగ్ బాస్ మొదలైంది. తొలి వారం కూడా గడిచిపోయింది. తొలి వారం ఎలిమినేసన్ లో హాట్ బ్యూటీ సరయు Sarayu() ఎలిమినేట్ కావడం జరిగిపోయింది. బిగ్ బాస్ లోకి 19 మందితోపాటు ఎంట్రీ ఇచ్చింది కంటెస్టెంట్ సరయు. 7 ఆర్ట్స్ అనే యూట్యూబ్ చానెల్ లో ‘బూతుల రాణి’గా పేరొందిన ఈమె బూతులు మాట్లాడుతూ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సరయు అంటేనే బూతులు అన్నట్టుగా ఫేమస్ అయ్యింది.

    అయితే బిగ్ బాస్ లోకి వచ్చాక మాత్రం ‘సరయు’ సైలెంట్ అయ్యింది. బూతులు తిట్టకపోయినా గొడవలు అయితే బాగానే పెట్టుకుంది. కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా కాజల్ తో.. ఆ తర్వాత సిరీ సహా కంటెస్టెంట్లతో భారీగా గొడవలకు దిగడం సరయుకు మైనస్ అయ్యింది.

    ఇక లోబోతో కలిసి సిగరేట్ రూమ్ లోకి వెళ్లి సిగరెట్ కాల్చడం కూడా సరయుకు భారీగా మైనస్ అయ్యిందని అంటున్నారు. సరయు ఇంత హాట్ అని సిగరెట్ కూడా మగాళ్లలాగా కాలుస్తుందని చాలామందికి తెలియదు. టీవీ చూస్తున్న మహిళలు, యువత కూడా సరయు సిగరెట్ తాగడాన్ని జీర్ణించుకోలేదు. అందుకే ఆమెకు ఎక్కువగా ఓట్లు పడలేదని తెలిసింది. దీంతో అంతకుమందు వరకు ‘హమీదా’ లేదా ‘జెస్సీ ఎలిమినేట్ అవుతారని అందరూ భావించారు. కానీ చివరి రోజుల్లో ‘సరయు’ ‘‘దూకుడు, బూతులు-తిట్ల వర్షం, సిగరెట్ తాగడం’’ ఇలా ఆమెకు మైనస్ గా మారి బిగ్ బాస్ ఇంటి నుంచే బయటకు పోవడానికి కారణమైంది.

    నిజానికి తొలి రెండు రోజుల్లో వ్యవహరించిన తీరుతో ‘జెస్సీ’ ఈ వారం ఎలిమినేట్ అవుతాడని అనుకున్నారు. మధ్యలో హమీద పని అయిపోందన్నారు. ఓటింగ్ లో వెనుకబడ్డారు. కానీ చివరి రెండు రోజుల్లో వివాదాస్పదంగా వ్యవహరించిన ‘సరయు’కు బాగా మైనస్ అయ్యింది. ఆమె ఓటింగ్ లో వెనుకబడి పోయింది. బోల్డ్ నెస్, సిగరెట్ తాగడం.. కంటెస్టెంట్లతో గొడవలే బిగ్ బాస్ నుంచి ‘సరయు’ ఎలిమినేషన్ కు కారణమైందన్న టాక్ వినిపిస్తోంది.

    ఇక గ్రూపులు కూడా సరయుకు బాగా మైనస్ అయ్యాయి. అమ్మాయిలు, అబ్బాయిలు గ్రూపులు కట్టడం.. అది జీర్ణించుకోక సరయు ఏడ్వడం..విమర్శలు చేయడం మైనస్ గా మారింది. ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఆడడమే సరయు ఎలిమినేషన్ కు కారణంగా చెబుతున్నారు.