https://oktelugu.com/

Salaar: సలార్ లో అసలు ట్విస్ట్ ఇదే…అసలు విలన్ ఎవరో చెప్పేసిన డైరెక్టర్..

ఈ సినిమా ఈనెల 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగ ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ ని డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొదటి ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకోకపోవడంతోనే ఈ రెండో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది.

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2023 / 03:44 PM IST
    Follow us on

    Salaar: ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న సలార్ సినిమా మీద రోజు రోజుకి అంచనాలు భారీగా పెరుగుతున్నాయి. ఇక రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సింగిల్ గా ఒక సాంగ్ ని కూడా వదిలారు. ఈ సాంగ్ మాత్రం ప్రేక్షకుల్లో మంచి ఆదరణను చోర గొంటున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇంతకు ముందు వచ్చిన ట్రైలర్ కొంతవరకు డివైడ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఈ సాంగ్ మాత్రం ప్రేక్షకుల్లో మంచి ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది.

    అందుకే సినిమా అభిమానులు ఈ సాంగ్ ని ఒకటికి పది సార్లు వింటు సోషల్ మీడియా వేదిక గా ఆ సాంగ్ గురించి వాళ్ల అభిప్రాయాలను కూడా తెలియ జేయడంతో ఆ కామెంట్లు సోషల్ మీడియా లో తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా ఈనెల 22 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగ ఈ సినిమాకు సంబంధించిన సెకండ్ ట్రైలర్ ని డిసెంబర్ 17వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. మొదటి ట్రైలర్ ప్రేక్షకుల్ని ఎక్కువగా ఆకట్టుకోకపోవడంతోనే ఈ రెండో ట్రైలర్ ని రిలీజ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాలో ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఈ సినిమాలో పృథ్వి రాజ్ సుకుమారన్ ప్రభాస్ ఇద్దరూ కూడా మంచి స్నేహితులుగా ఉంటారు.

    దాంట్లో భాగంగానే ప్రభాస్ ఆయనకి హెల్ప్ చేయడానికి వేరే ప్రాంతం నుంచి వచ్చి తన ప్రాణాలకు తెగించి ఆయనకి హెల్ప్ చేస్తాడు.అయితే ప్రభాస్ నుంచి హెల్ప్ పొందిన తర్వాత పృథ్వి రాజ్ ప్రభాస్ కి నమ్మకద్రోహం చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ప్రభాస్ ఎంత అయితే ఫ్రెండ్షిప్ కి వాల్యూ ఇస్తాడో అవన్నీ మర్చిపోయి పృథ్వి రాజ్ సుకుమారన్ తనకి వెన్నుపోటు పొడిచే విధంగా ఈ స్టోరీ ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. చివర్లో పృథ్వి రాజ్ కి ప్రభాస్ కి మధ్య భారీ ఫైట్ కూడా ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. వీళ్ళ మధ్య సాగే ఫైట్ దాదాపు పది నిమిషాల వరకు ఉంటుందన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.

    ఇక ఇప్పటికే ప్రశాంత్ నీల్ కూడా పృథ్వి రాజ్ సుకుమారన్ క్యారెక్టర్ లో డిఫరెంట్ డైమెన్షన్స్ ఉంటాయని ఇంతకు ముందే చాలాసార్లు చెప్పాడు అంటే ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే తన అవసరం తీరిన తర్వాత పృథ్వి రాజ్ ప్రభాస్ ని దూరంపెట్టే క్రమంలో ప్రభాస్ ని వెన్నుపోటు పొడిచే ప్రమాదం కూడా ఉంది అన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి…ఇక ఈ వార్తల్లో నిజం ఉందా లేదా తెలియాలంటే ఈనెల 22 వ తేదీ వరకు వెయిట్ చేయక తప్పదు…