https://oktelugu.com/

Bigg Boss 7 Telugu : ప్రియాంక-అమర్ రిలేషన్ పై ప్రియుడు షాకింగ్ కామెంట్స్.. నాకు నచ్చలేదంటూ ఓపెన్!

ప్రియాంక కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అంటూ ఓపెన్ గా అడిగేసింది. కానీ ప్రస్తుతం ప్రియాంక జైన్ ప్రియుడు అమర్ .. ప్రియాంక బంధం గురించి అసహనం వ్యక్తం చేశారు.

Written By:
  • NARESH
  • , Updated On : December 14, 2023 / 03:37 PM IST
    Follow us on

    Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ సీజన్ 7 ఫైనలిస్టులు గా నిలిచిన అమర్ దీప్, ప్రియాంకల గురించి అందరికీ తెలిసిందే. అయితే బిగ్ బాస్ హౌస్ లో వారి మధ్య మంచి బంధం ఏర్పడింది. వీళ్ళతో శోభా కూడా కలిసిపోయింది. ఇక ముగ్గురూ ఒకే ఆట .. ఒకే మాటగా హౌస్ లో ప్రయాణాన్ని కొనసాగించారు. కానీ శోభా కంటే కూడా ప్రియాంకకు ఎక్కువ విలువ ఇస్తాడు అమర్. ఇది చాలా సార్లు ప్రూవ్ అయింది. అమర్ – ప్రియాంక జానకి కలగనలేదు సీరియల్ జంటగా నటించారు. వీరికి గట్టి పరిచయం ఉంది.

    ఆ బంధాన్ని హౌస్ లో కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. తాజాగా ఆమె ప్రియుడు శివ్ కుమార్ వారి బంధం పై క్లారిటీ ఇచ్చాడు. కాగా ఫ్యామిలీ వీక్ లో భాగంగా హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాడు శివ కుమార్. ప్రియాంక చాలా కాలంగా శివ్ కుమార్ తో కలిసి ఉంటుంది. వాళ్లిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన శివ కుమార్ ఆమెను మిస్ అవుతున్నాను అంటూ తెగ ప్రేమ కురిపించాడు.

    ప్రియాంక కూడా పెళ్లి ఎప్పుడు చేసుకుందాం అంటూ ఓపెన్ గా అడిగేసింది. కానీ ప్రస్తుతం ప్రియాంక జైన్ ప్రియుడు అమర్ .. ప్రియాంక బంధం గురించి అసహనం వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శివ కుమార్ కొన్ని సంచలన కామెంట్స్ చేశారు. అమర్ దీప్ .. ప్రియాంకతో ఉంటున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసాడు. అయితే అమర్ దీప్, ప్రియాంక లు కలిసి పనిచేయడం వల్ల వారి మధ్య మంచి బంధం ఏర్పడింది.

    వాళ్ళు ఇద్దరు ఒకరికి ఒకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉంటారని చెప్పారు. కానీ బాల్ టాస్క్ లో మాత్రం .. ప్రియాంక ఒక అమ్మాయి అని కూడా చూడకుండా .. లేపి క్రింద పడేయడం నాకు అస్సలు నచ్చలేదు .. ఈ ఎపిసోడ్ వచ్చిన రోజు చాలా బాధ పడ్డాను అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు శివ కుమార్. ప్రియాంక తల్లిదండ్రులు కూడా ఈ విషయాన్ని జీర్ణించుకోలేక పోయారని చెప్పారు. ప్రియాంక గెలిచే అవకాశం లేదు .. కానీ గెలిస్తే బాగుంటుంది అని ఆశాభావం వ్యక్తం చేశాడు.