Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి క్రేజ్ శిఖర స్థాయిలో ఉంటుంది అనడానికి ఆయన సంపాదించుకున్న అభిమానులే నిదర్శనం…చిరంజీవి ఒంటరిగా సినిమా ఇండస్ట్రీకి వచ్చి తన స్వశక్తితో ఎదిగి తనకంటూ గొప్ప పేరుని సంపాదించుకొని సామాన్యుడు సైతం హీరో అవ్వచ్చు అనే దాన్ని బలంగా నమ్మి చేసి చూపించిన ఒకే ఒక్కడు చిరంజీవి…
చిరంజీవి సినిమా ఇండస్ట్రీకి వచ్చే ముందు వరకు తెలుగు సినిమాలు అన్నీ కూడా ఒక మూస దోరణిలో ఉండేవి.ఇక ఆయన ఇండస్ట్రీకి వచ్చి హీరో అయిన తర్వాత సినిమా ఇండస్ట్రీ మొత్తం మారిపోయింది. ఎలా అంటే తనదైన నటనతో, డాన్స్ తో, డైలాగులతో అదరగొట్టిన చిరంజీవి ప్రేక్షకులను విపరీతమైన ఆనందానికి గురి చేశాడు.ఇక దాంతో చిరంజీవి సినిమా మొదటిరోజు చూడకపోతే మనం వేస్ట్ అనుకునేంత రేంజ్ లో అభిమానులను అట్రాక్ట్ చేసాడు అంటే నిజంగా చిరంజీవికి హ్యాట్సాఫ్ చెప్పకుండా ఉండలేం.
ఇక 70 సంవత్సరాలకి దగ్గర గా ఉన్న ఇప్పటికి కూడా ఆయన వరుస సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. అయితే చిరంజీవి మీద సీనియర్ నటుడు అయిన కమలహాసన్ కొన్ని అరుదైన వ్యాఖ్యలను చేశాడు.అవి ఏంటి అంటే చిరంజీవి తమిళం లో సినిమాలు చేయడానికి గాని, అతని సినిమాలు తమిళ్లో డబ్బింగ్ చేయడానికి కానీ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించలేదు అందువల్లే ఆయన తెలుగు కి మాత్రమే పరిమితం అయిపోయాడు. లేకపోతే ఆయనకి ఉన్న టాలెంట్ కి తమిళ్ లో కూడా తను మెగాస్టార్ గా ఎదిగేవాడు అంటూ చిరంజీవి గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు…
నిజానికి కమలహాసన్ చెప్పిన దాంట్లో వాస్తవం ఉంది. ఎందుకంటే చిరంజీవి కి ఉన్న టాలెంట్ కి తమిళ్ ప్రేక్షకులను ఈజీగా మెప్పించేవాడు కానీ అతను ఆ రకంగా చేయలేదు దానికి కారణం ఒక తెలుగులో మాత్రమే మనం స్టార్ గా కొనసాగితే సరిపోతుంది. మనకు తెలియని ఇండస్ట్రీకి వెళ్లి మనం ఇబ్బందులు పడే కంటే తెలిసిన ఇండస్ట్రీ లోనే మంచి సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పిస్తే చాలు అనే ఉద్దేశ్యం లో చిరంజీవి ఉండేవాడు అందుకే ఆయన తెలుగులోనే సినిమాలు చేసుకుంటూ ముందుకు వెళ్ళేవాడు.
కానీ చిరంజీవికి ఉన్న నటన శక్తికి తను ఇక్కడే ఆగిపోకుండా తమిళ్ ఇండస్ట్రీ లోకి కూడా వెళితే బాగుండేది అక్కడ కూడ స్టార్ హీరోగా కొనసాగేవాడు అంటూ అభిమానులు కూడా పదే పదే వాళ్ల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు… కమలహాసన్ చెప్పిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారుతున్నాయి…