Vijay Deverakonda: హీరో ‘విజయ్ దేవరకొండ’లో మంచి ప్లానర్ ఉన్నాడు. ఏ సమయంలో ఏమి మాట్లాడాలో విజయ్ కు బాగా తెలుసు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ తన తమ్ముడు ఆనంద్ దేవరకొండను పెట్టి.. ‘పుష్పక విమానం’ అని ఒక సినిమా తీశాడు. ఈ సినిమాకు నిర్మాత తనే గనుక.. ఈ సినిమాను బాగా ప్రమోట్ చేస్తూ.. ఇంటర్వ్యూల్లో మంచి మసాలా కంటెంట్ ను వదులుతూ.. మొత్తానికి ‘పుష్పక విమానం’ను ప్రేక్షక లోకం లోకి బాగానే తీసుకు వెళ్తున్నాడు. ‘

ఈ నెల 12న ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో రిలీజ్ కాబోతుంది. థియేటర్లో ప్రస్తుతం బలమైన సినిమా లేదు కాబట్టి.. ఈ సినిమాకు మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది. పైగా ఈ సినిమా ట్రైలర్ కూడా బాగా క్లిక్ అయింది. అందుకే, ఈ సినిమా ప్రమోషన్స్ ను విపరీతంగా చేస్తున్నాడు విజయ్. ముఖ్యంగా తన తమ్ముడితో కలిసి వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు.
తాజాగా ఈ అన్నదమ్ములిద్దరూ కలిసి ఒక వీడియో చేశారు. ఆ వీడియో వైరల్ అవ్వడానికి విజయ్ దేవరకొండ(Vijay Deverakonda) తెలివిగా కొన్ని కామెంట్లు చేశాడు. ‘మీరు ఎవరితో అయినా లవ్ లో ఉన్నారా ?’ అన్న ప్రశ్నకు విజయ్ దేవరకొండ సమాధానం డౌట్లును రేకెత్తించింది. ఇంతకీ విజయ్ దేవరకొండ ఏమి మాట్లాడాడు అంటే.. విజయ్ మాటల్లోనే.. ‘హే.. ఈ మధ్య నా హార్ట్ బ్రేక్ అయినాది అబ్బా. ఇంకా ఎవరికీ దాని గురించి తెలీదు. ప్రజెంట్ నేను ఆ బాధలో ఉన్నాను’ అంటూ విజయ్ చెప్పుకొచ్చాడు.
అయితే, విజయ్ ఎందుకు ఇలాంటి ఆన్సర్ ఇచ్చాడు ? అసలు విజయ్ దేవరకొండకు నిజంగానే ఒక అమ్మాయితో బ్రేకప్ అయిందా ? లేక, ఇంకా ఏదైనా విషయం ఉందా ? అని విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చకు దిగారు. అసలు విషయం చెప్పకుండా విజయ్ చెప్పిన ఆన్సర్ కారణంగా మొత్తానికి ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.
అయితే, విజయ్ కావాలనే ఈ సమాధానం చెప్పాడు అని, పుష్పక విమానం జనాల్లోకి వెళ్ళాలి అంటే.. మసాలా కామెంట్స్ ఉండాలని భావించిన విజయ్ ఈ విధంగా ఫన్నీగా ఆన్సర్ చెప్పాడని అంటున్నారు. అయినా విజయ్ దేవరకొండ హార్ట్ బ్రేక్ అవడానికి ఆస్కారం లేదట. కరోనా తర్వాత నుంచి విజయ్ తన లవ్ మ్యాటర్ గురించి చెబుతూ.. తనకు అలాంటిది ఏమి లేదని క్లారిటీ ఇస్తూనే ఉన్నాడు.
మరి ఉన్నట్టు ఉండి ఇప్పుడు ఈ కామెంట్స్ చేయడానికి కారణం.. తమ్ముడి సినిమా ప్రమోషనే కారణం అయి ఉంటుంది.