Sree Vishnu: వైవిధ్యభరిత చిత్రాలు తీస్తూ టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు యంగ్ హీరో శ్రీవిష్ణు. ఇటీవల కాలంలో పలు సినిమాలతో మంచి సక్సెస్ అందుకొని ఈ యంగ్ హీరో ఫుల్ ఫామ్ లో ఉన్నాడని చెప్పాలి. ఆయన నటించిన బ్రోచేవారెవరురా, రాజ రాజ చోర చిత్రాలు మంచి హిట్ సాధించడంతో శ్రీ విష్ణు తదుపరి మూవీ లపై ఆసక్తి నెలకొంది.

ఆయన తాజాగా నటిస్తున్న చిత్రం “అర్జున ఫల్గుణ”. తేజ మర్ని దర్శకత్వంలో మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. శ్రీ విష్ణు సరసన ఈ సినిమాలో అమ్రిత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తుంది. అయితే తాజాగా ఈ మూవీ గురించి ఓ ఆసక్తికర అప్డేట్ ను మూవీ యూనిట్ ప్రకటించింది. నవంబర్ 9న ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్టర్ ను శ్రీ విష్ణు రిలీజ్ చేశారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి వీరాభిమానిగా నటిస్తున్నాడు.
మాస్ ఆడియన్స్ లో ఎన్టీఆర్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి తారక్ కి అభిమానిగా శ్రీ విష్ణు నటిస్తుండడంతో మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ పోస్టర్ లో శ్రీ విష్ణు చేతికి రక్తంతో తడిచిన కర్చీఫ్ దానిపై ఎన్టీఆర్ అనే పేరు ఉంది. ఇక ఈ పోస్టర్ చూస్తుంటే తారక్ అభిమానులకు మూవీ లో మంచి ట్రీట్ రెడీగా ఉన్నట్టు అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.