
Tabu: సీనియర్ హీరోయిన్ ‘టబు’ ఒక వెర్సటైల్ నటి. కాకపోతే ఆమె బోల్డ్ ప్రపంచంలో మహారాణిలా పేరు తెచ్చుకుంది. పైగా లేటు వయసులో కూడా ఘాటు పాత్రలకు ప్రాణం పోయడానికి, అందాలు ఆరబోయడానికి సర్వదా సిద్ధంగా ఉంటాను అంటూ ఎప్పటికప్పుడు మేకర్స్ కు కూడా మెసేజ్ లు పాస్ చేస్తూ ఉంటుంది. తాజాగా టబు ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది.
‘వయసు అయిపోయింది, ఇకనైనా పద్ధతిగల పాత్రలు చేస్తారా ? లేక, ఎప్పటిలాగే ముదురు అందాలతో దాడి చేస్తారా ?’ అన్నట్టు సదరు యాంకర్ ఒక ప్రశ్న వేశాడు. దానికి టబు సమాధానం ఏమిటో తెలుసా ? టబు(Tabu) మాటల్లోనే.. ‘నేను ఏదైనా చేస్తాను. తల్లి పాత్రనా లేక, బోల్డ్ పాత్రనా అని చూడను. అలాగే విలన్ పాత్రనా ? లేక క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా ? అనే భయం లేదు. నేను ఏదైనా చెయ్యగలను. నన్ను నేను ఆ పాత్రకు తగ్గట్లు మలుచుకోగలను’ అని చెబుతూనే..
‘నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. ఈ వయసులో కూడా బోల్డ్ గా ఎలా నటిస్తున్నారు అని ?. అవసరం అయితే, నేను ఇప్పుడు కూడా బికినీ వేయగలను. నాకు నచ్చితే నాకు నచ్చినట్టు చేస్తాను. నాకు ఒక పద్ధతి, ఒక సిద్ధాంతం అంటూ ఏమీ లేదు. ఎప్పుడైతే ఒక నటికి తన ఇమేజ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదో అప్పుడు మంచి పాత్రలు దక్కుతాయి. నాకు అలాగే పాత్రలు వస్తున్నాయి. నేను చేస్తున్నాను. అంటూ తన సక్సెస్ సీక్రెట్ చెప్పుకొచ్చింది టబు.
ఏది ఏమైనా ఇప్పటికీ యూత్ లో టబుకు ఫుల్ ఫాలోయింగ్ ఉంది. ఒకపక్క సైడ్ పాత్రలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే.. కుదిరితే మెయిన్ రోల్స్ కోసం టబు తాపత్రయ పడుతుంది. తనలో ఇంకా గ్లామర్ ఏ మాత్రం తగ్గలేదు అని చాటి చెప్పడానికి పరిధి దాటిన పాత్రల్లో కూడా జీవిస్తోంది.
అసలు ఒకపక్క అల్లు అర్జున్, షాహిద్ కపూర్ వంటి హీరోలకు తల్లిగా నటిస్తూనే.. మరోపక్క ఇషాన్ ఖట్టర్ వంటి కుర్రాడితో ఎఫైర్ పెట్టుకునే ఆంటీ పాత్రలలో కూడా నటిస్తోంది. 50 ప్లస్ వయసులో కూడా బోల్డ్ పాత్రలు చేస్తోంది అంటే… టబు వ్యక్తిత్వం ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
Also Read: మరో బూతు సిరీస్ కి ‘టబు’ సిద్ధం !