https://oktelugu.com/

Devara movie : దేవర సినిమా నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ ఇదే…ఊచకోత మొదలవ్వబోతుందా..?

జూనియర్ ఎన్టీయార్ సినిమా వచ్చిందంటే చాలు అభిమానులు ఆ సినిమా చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు... ఇక ఇదిలా ఉంటే ఇండస్ట్రీ లో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్న జూనియర్ ఎన్టీయార్ కి ఉన్న క్రేజ్ వేరే లెవల్ అనే చెప్పాలి...

Written By:
  • Gopi
  • , Updated On : August 11, 2024 / 09:48 PM IST
    Follow us on

    Devara Movie : తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది అరుదైన నటుల్లో ‘జూనియర్ ఎన్టీఆర్’ ఒకరు..ఆయన గురించి మనం ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన సాధించిన విజయాలు ఆయనను చాలా గొప్పగా మనకి పరిచయం చేస్తాయి. అందుకే జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలామంది ప్రేక్షకులకు అమితమైన ఇష్టం ఉంటుంది. ఆయన సినిమాలను చూడడానికి కూడా ప్రేక్షకులు చాలావరకు ఉత్సాహం చూపిస్తూ ఉంటారు. నిజానికి ఆయన లాంటి నటుడు ఈ జనరేషన్ లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో మరొకరు లేరు అనేది మాత్రం వాస్తవం…ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన ‘కొరటాల శివ’ డైరెక్షన్ లో ‘ దేవర ‘అనే సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రతి అప్డేట్ ని ప్రేక్షకులతో పంచుకుంటున్న మేకర్స్ ఈ సినిమా మీద అంచనాలను పెంచుతున్నారు…ఇక సెప్టెంబర్ 27వ తేదీన భారీ అంచనాలతో ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుండటం విశేషం… ఇక అందులో భాగంగానే రీసెంట్ గా ‘చుట్టమల్లే ‘ అనే రొమాంటిక్ సాంగ్ ను కూడా రిలీజ్ చేశారు.

    ఇక ఇదిలా ఉంటే ఇంతకు ముందే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ నుంచి సోషల్ మీడియా వేదికగా ఒక ‘గొడ్డలి పిక్’ ను పోస్ట్ చేస్తు దానికి ‘ఆయుధ పూజ’ అనే ట్యాగ్ ని ఆడ్ చేశారు. దీంతో ఎన్టీఆర్ అభిమానుల్లో అంచనాలు తారా స్థాయికి చేరుకున్నాయనే చెప్పాలి. ఒకప్పుడు ఎన్టీయార్ రాజమౌళి డైరెక్షన్ లో చేసిన సింహాద్రి సినిమాలో వైలెన్స్ ఏ విధంగా ఉందో ఇప్పుడు ఈ సినిమాలో అంతకుమించి వైలెన్స్ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే దేవర సినిమాలో మాస్ ఎలిమెంట్స్ ని హైలెట్ చేస్తూ కొరటాల శివ తనదైన రీతిలో ఈ సినిమాని తెరకెక్కిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది…

    మిర్చి సినిమాలో ప్రభాస్ ని ఏ రేంజ్ లో అయితే చూపించాడో అంతకుమించి అనేలా ఇందులో ఎన్టీయార్ ను చూపించడానికి కొరటాల చాలా వరకు ప్రయత్నాలైతే చేస్తున్నాడు. ఇక ఒక్కసారిగా ఈ సినిమా మీద అంచనాలు పెంచేసిన ఈ పిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఈ మూవీతో పాన్ ఇండియాలో భారీ సక్సెస్ ని అందుకొని పాన్ ఇండియాలో ఉన్న టాప్ హీరోల్లో తను కూడా ఒక్కడిగా గుర్తింపు సంపాదించుకోవాలనే ప్రయత్నంలో అయితే ఎన్టీయార్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

    ఇక ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో మరొక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ని చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక ఇప్పటికే వరుసగా 6 హిట్లతో మంచి ఊపు మీదున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో ఒక భారీ సక్సెస్ ని కొట్టి ఇండియన్ స్క్రీన్ మీద తన నట విశ్వరూపాన్ని చూపించడానికి రెడీ అవుతున్నాడు… చూడాలి మరి ఈ సినిమా పాన్ ఇండియా లో ఎలాంటి రికార్డ్ లను క్రియేట్ చేస్తుందో…