Homeఎంటర్టైన్మెంట్Shakeela: అమ్మ షకీలా…. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఇది సెకండ్ టైం కదూ….

Shakeela: అమ్మ షకీలా…. బిగ్ బాస్ షోలో పాల్గొనడం ఇది సెకండ్ టైం కదూ….

Shakeela: ప్రస్తుతం ఎక్కడ చూసినా బిగ్ బాస్ సీజన్ సెవెన్ హాట్ టాపిక్ గా మారింది. మరీ ముఖ్యంగా మొన్న రెండవ వారం ఎలిమినేషన్ ఓటింగ్ ప్రక్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. బిగ్ బాస్ షోలోకి ఎంటర్ అయ్యే కంటెస్టెంట్స్ అందరూ ఎంతో కొంత ఫాలోయింగ్ ఉన్న వారే అవుతారు. ఒకప్పుడు ఫేమస్ అయిన నటీనటులు చాలా వరకు బిగ్ బాస్ షోలో పార్టిసిపేట్ చేసి తిరిగి ఫేమ్ సంపాదించారు. ఈ క్రమంలో ఈసారి బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో వచ్చిన ఒకప్పటి నటి షకీలా.

ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో అమ్మగా అవతారం ఎత్తిన ఈ షకీలా…ఎవ్వరికీ కనిపించని మైండ్ గేమ్ ఆడుతోంది అన్న విషయం ఈ మధ్య బయటపడింది. రెండవ వారం నామినేషన్ లో భాగంగా పల్లవి ప్రశాంత్ ని నామినేట్ చేసే సమయంలో చాలావరకు కంటెస్టెంట్స్ అతను ఇంతకుముందు బిగ్ బాస్ షోలు అన్ని చూసి, వాటిని అవగాహనలో పెట్టుకొని మైండ్ గేమ్ ఆడుతున్నాడు అని ఆరోపించారు. ఆ సమయంలో షకీలా మాత్రం బెల్లం కొట్టిన రాయిలా గమ్ముగా ఉంది.

షకీలా మౌనం వెనుక కారణం ఏమిటో.. అప్పుడు అర్థం కాని వాళ్ళకి ఇప్పుడు చెప్పే విషయం వింటే కచ్చితంగా అర్థం అవుతుంది. బోల్డ్ క్యారెక్టర్స్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉన్న షకీలా కొంతకాలం సినీ ఇండస్ట్రీలో క్రియేట్ చేసిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మలయాళంలో ఆమెకు ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది. షకీలా మూవీ కన్నడలో విడుదలవుతోంది అంటే పెద్ద పెద్ద హీరోల చిత్రాలు సైతం అదే టైం కి విడుదల చేయడానికి భయపడే వారట.

తర్వాత క్రమంగా ఆమె సినిమాలు బ్యాన్ చేయాలి.. అని మాలీవుడ్ అంతా ఏకం కావడంతో…మెల్లిగా షకీలా పక్కకు తప్పుకుంది. ప్రొఫెషనల్ లైఫే కాదు పర్సనల్ లైఫ్ లో కూడా షకీలా మోసపోయింది. సొంత కుటుంబ సభ్యుల ఆమెను మోసం చేసి ఆస్తి మొత్తం లాక్కున్నారు. సరే అసలు విషయానికి వస్తే…షకీలా కు ఇది మొదటి బిగ్ బాస్ కాదు.. అవును ఇంతకుముందు ఆమె కన్నడ బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఉంది.

దాదాపు ఏడేళ్ల క్రితం బిగ్ బాస్ కన్నడ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా హౌస్ లోకి ఎంటర్ అయిన షకీలా.. మొత్తానికి హౌస్ లో 26 రోజులు ఉంది. థర్డ్ వీక్ ఎలిమినేట్ అవ్వడంతో 27వ రోజు బయటకు వచ్చేసింది. ఇలా షకీలాకు ఇంతకుముందే బిగ్ బాస్ ఆడిన అనుభవం ఉంది. ఇప్పుడు ఏడు సంవత్సరాల తరువాత బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

అయితే అప్పటి బిగ్ బాస్ లో షకీలా బిహేవియర్ కి ఇప్పటికీ ఎంతో తేడా గమనించవచ్చు. చాలా నిదానంగా…తను చెప్పాలనేది చాలా కన్వెన్షన్ గా క్యారీ ఆన్ చేస్తోంది. అయితే ఒక భాష బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా ఉన్న వ్యక్తి మరొక భాషలో కనిపించకూడదు అని రూల్ అయితే లేదు. ఇలా ఇంతకుముందు వేరే భాషలో కంటెస్టెంట్ గా ఉండి తిరిగి తెలుగు బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా వచ్చిన వారి లిస్ట్ లో ఇప్పటివరకు బిందు మాధవి ఉండేది.. ఇప్పుడు షకీలా కూడా ఆ లిస్టులో యాడ్ అయింది. మరి ఈ సీజన్లో షకీలా ఎన్ని రోజులు బిగ్ బాస్ హౌస్ లో ఉండగలుగుతుందో చూడాలి.

Bathini Surendar
Bathini Surendarhttp://oktelugu
Bathini Surendar is a Journlist and content writer with good Knowledge on News Writing. He is experience in writing stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular