Sneha Ullal: స్నేహ ఉల్లాల్ ఆరంగేట్రమే ఓ సంచలనం. జూనియర్ ఐశ్వర్యరాయ్ గా పేరుగాంచిన స్నేహ ఉల్లాల్ డెబ్యూ హీరో సల్మాన్ ఖాన్ తో అయ్యింది. 2005లో విడుదలైన ‘లక్కీ’ ఆమె మొదటి చిత్రం. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన లక్కీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. రెండో మూవీ ఆర్యన్. ఇది కూడా నిరాశపరిచింది. తొలిప్రేమ ఫేమ్ కరుణాకర్ ఆమెను టాలీవుడ్ కి పరిచయం చేశాడు. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ మంచి విజయం సాధించింది. దాంతో తెలుగులో స్నేహకు వరుస ఆఫర్స్ వచ్చాయి.
మంచు విష్ణుకు జంటగా నటించిన నేను మీకు తెలుసా? నిరాశపరిచింది. నాగార్జున-శ్రీను వైట్ల కాంబోలో తెరకెక్కిన కింగ్ చిత్రంలో స్నేహ ఉల్లాల్ స్పెషల్ సాంగ్ చేయడం విశేషం. అనంతరం ‘కరెంట్’ రూపంలో ఆమెకు మరో హిట్ పడింది. అక్కినేని హీరో సుశాంత్ హీరోగా నటించాడు. స్నేహ ఉల్లాల్ అకౌంట్ లో ఉన్న భారీ హిట్ సింహ. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన సింహా చిత్రంలో నయనతారతో పాటు స్నేహ ఉల్లాల్ మరో హీరోయిన్ గా నటించింది.
హిట్ పడినా స్నేహ ఉల్లాల్ అలా మొదలైంది చిత్రంలో ప్రాధాన్యత లేని సెకండ్ హీరోయిన్ పాత్ర చేసింది. అది ఆమె కెరీర్ కి మైనస్ అని చెప్పాలి. 2012 తర్వాత స్నేహ ఉల్లాల్ కెరీర్ నెమ్మదించింది. అల్లరి నరేష్ తో చేసిన యాక్షన్ 3D ఆడలేదు. 2015 తర్వాత వెండితెరకు దూరమైంది. ఒక దశలో స్నేహ ఉల్లాల్ తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంది. కోలుకునేందుకు చాలా సమయం పట్టింది. 2020లో ఆమె కమ్ బ్యాక్ ఇచ్చారు. ఎక్స్పైరీ డేట్ టైటిల్ తో ఒక వెబ్ సిరీస్ చేసింది. 2022లో లవ్ యు లోక్ తంత్ర అనే హిందీ చిత్రంలో నటించారు.
మరలా ఆమెకు గ్యాప్ వచ్చింది. ఈ మధ్య కాలంలో స్నేహ నటించిన ఒక్క సినిమా విడుదల కాలేదు. అయితే సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కి అందుబాటులో ఉంటుంది. తాజాగా సూపర్ గ్లామరస్ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేశారు. గోవా వెళ్లిన స్నేహ ఉల్లాల్ అక్కడ ఆహ్లాదంగా గడుపుతున్నారు. తన టూర్ డైరీస్ ఫోటోల రూపంలో ఫ్యాన్స్ తో పంచుకుంటున్నారు. సిన్హా ఉల్లాల్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ అద్భుతంగా ఉన్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు
View this post on Instagram