Raashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమాతో పాజిటివ్ టాక్ తెచ్చుకొని దర్శకనిర్మాతల కంట్లో పడింది రాశీ ఖన్నా. ఈ అమ్మడు నటించే తెలుగు సినిమాకు అభిమానులు కూడా ఎక్కువే. కానీ ఎన్టీఆర్ తో జై లవ కుశ సినిమా లో మినహా పెద్దగా సినిమా ల్లో నటించే అవకాశాలు దక్కలేదు. టైర్ 2 హీరోల సరసన నటించినా ఈ ముద్దుగుమ్మ గతంలో ఫుల్ బిజీగా మారింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు.
ఎందుకు రాశీఖన్నాను ఇండస్ట్రీలో చాలా మంది పట్టించుకోవడం లేదనే టాక్ వినిపిస్తుంది. ఒకప్పుడు వరుస పెట్టి సినిమాలు తీసిన ఈమె ఇప్పుడు సైలెంట్ అవడంతో అభిమానులు కూడా ఆందోళన చెందుతున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అసలు ఈమెకు ఛాన్స్ లు లేవు. దీంతో రాఖీ ఖన్నా ప్రస్తుతం ఏం చేస్తుంది? ఇతర ఇండస్ట్రీలో ఏమైనా ఛాన్స్ లు వచ్చాయా అని ఆరా తీస్తున్నారు ఆమె అభిమానులు. రీసెంట్ గా బ్లాక్ బాడీ కాన్ డ్రెస్ లో రాశి ఖన్నా క్లీవేజ్ అందాలు మైండ్ బ్లాక్ చేశాయి. అవార్డుల ఈవెంట్లో అందరి కళ్ళు ఆమె మీదే ఉన్నాయి. ముంబై వేదికగా జరిగిన గ్లోబల్ స్పా అవార్డ్స్ ఈవెంట్లో రాశి ఖన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఈ మధ్య ఎక్కువగా ముంబైలోనే ఉంటున్న రాశి ఖన్నా అక్కడి దర్శక నిర్మాతలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు.
సినిమా ల్లోనే కాకుండా వెబ్ సిరీస్ ల్లో కూడా ఈమె నటించేందుకు ఓకే అంటోంది. కానీ సిరీస్ మేకర్స్ కూడా ఎవరు రాశి ఖన్నా వైపు చూడటం లేదు. ఒకప్పుడు టైర్ 2 హీరో లు రాశి ఖన్నా తో నటించేందుకు చాలా ఆసక్తి చూపించేవారు. కానీ ఇప్పుడు వారు కూడా రాశి ఖన్నా ను పట్టించుకోవడం లేదట. ఇతర పరిశ్రమల్లో ఆఫర్స్ వస్తున్నా స్టార్ కాలేకపోతుంది. టాలీవుడ్ లో ఆమె జర్నీ ముగిసిన సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం రాశి చేతిలో ఒక్క తెలుగు ప్రాజెక్ట్ లేదు. 2022లో రాశి ఖన్నా హీరోయిన్ గా థాంక్యూ, పక్కా కమర్షియల్ విడుదలయ్యాయి. ఇవి రెండు డిజాస్టర్స్ అయ్యాయి. ఆ రెండు చిత్రాల పరాజయాలతో రాశి ఖన్నాకు టాలీవుడ్ లో దారులు మూసుకుపోయాయి. ఈ క్రమంలో బాలీవుడ్ మీద దృష్టి పెట్టింది. ప్రస్తుతం సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా తెరకెక్కుతున్న యోధ మూవీలో రాశి ఖన్నా హీరోయిన్ గా నటిస్తుంది. యోధ ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది.
అయితే ఈ అమ్మడు తమిళంలో రెండు సినిమాలు చేయబోతుంది. కానీ ఆ సినిమాలు కూడా చిన్న సినిమాలే. చిన్న సినిమాలు అయినా సక్సెస్ పెద్దగా ఉంటే తమిళం లో వరుస సినిమా లు చేసే అవకాశం దక్కుతుంది. ఇదే నిజం అయితే మళ్లీ టాలీవుడ్ లో అమ్మడుకు అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాస్త నెగటివ్ టాక్ తెచ్చుకున్న ఇక టాలీవుడ్ లో ఆఫర్లు రావడం కష్టమే అంటున్నారు సినీ విశ్లేషకులు. మరి చేతిలో ఉన్న సినిమాలను సక్సెస్ ట్రాక్ లో వచ్చేలా చూసుకుంటే ఈ సారి అయినా కెరీర్ నిలబడుతుంది. లేదా ఇక ఇండస్ట్రీలో కనిపించడం కూడా కష్టమే అని విశ్లేషకుల నుంచి వినిపిస్తున్న టాక్.