Kalki – Kamal Haasan : ఇండియా మొత్తం కల్కి మేనియా నడుస్తుంది. శాన్ డియాగో కామిక్ కాన్ 2023 వేదికగా టైటిల్, ప్రోమో విడుదల చేశారు. కల్కి ఫస్ట్ లుక్ విమర్శలకు గురి కాగా ఫ్యాన్స్ నిరాశ చెందారు. అసలు ఇది ఒరిజినలా లేక మార్ఫింగ్ చేశారా? దీని కంటే ఫ్యాన్ మేడ్ బెటర్ కదా? అనే విమర్శలు వినిపించాయి. అయితే టీజర్ తో అనుమానాలు పటాపంచలు చేశారు. గురువారం అర్ధరాత్రి విడుదలైన కల్కి 2898 AD టీజర్ మెప్పించింది. అత్యున్నత సాంకేతికత, నిర్మాణ విలువలు కలిగి ఉంది.