చిన్న సినిమాలకు ఇది బంపర్ ఆఫరే !

కరోనా మహమ్మారి రాకతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ రూపురేఖలతో పాటు స్తొమత స్థాయిలు కూడా మారిపోయాయని చెప్పాలేమో ప్రస్తుత పరిస్థితి చూస్తే. ఎందుకంటే ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ అందరూ వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిల్మ్ ల వైపు చూస్తున్నారు. ఏమో చూస్తున్నారు అనేకంటే అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా‘ కోసం చూసేలా చేస్తున్నాడు అనడం కరెక్టేమో. ఆహా కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి ఇప్పటికే చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తూనే.. మరోపక్క […]

Written By: admin, Updated On : July 20, 2020 9:12 pm
Follow us on


కరోనా మహమ్మారి రాకతో డిజిటల్ ప్లాట్ ఫామ్స్ రూపురేఖలతో పాటు స్తొమత స్థాయిలు కూడా మారిపోయాయని చెప్పాలేమో ప్రస్తుత పరిస్థితి చూస్తే. ఎందుకంటే ఇప్పుడు స్టార్ డైరెక్టర్స్ అందరూ వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిల్మ్ ల వైపు చూస్తున్నారు. ఏమో చూస్తున్నారు అనేకంటే అల్లు అరవింద్ తన ఓటిటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా‘ కోసం చూసేలా చేస్తున్నాడు అనడం కరెక్టేమో. ఆహా కోసం డిజిటల్ కంటెంట్‌ను రూపొందించడానికి ఇప్పటికే చాలా మంది దర్శకులతో ప్లాన్ చేస్తూనే.. మరోపక్క రెడీగా ఉన్న చిన్న సినిమాలను కొనడానికి ఒక టీంను రెడీ చేశారు.

మెగాస్టార్ భయం అదే.. కానీ దానికే ఫిక్స్ !

ఏమైనా మారుతున్న కాలానికి అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ సాగుతున్న అరవింద్, ప్రస్తుతం తన డిజిటల్ ఫ్లాట్ ఫామ్ తో తెలుగులో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు. అమెజాన్, జీ5, హాట్ స్టార్ మాదిరిగానే ఆహాను ఆ స్థాయిలో నిలబెట్టడానికి పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ముందుకు పోతున్నాడు. నిజానికి కొత్త సినిమాల వరకు సబ్ స్క్రిప్షన్ చేసుకుంటేనే వీక్షించే వీలున్నప్పటికీ.. పాత హిట్ సినిమాల్ని మాత్రం ఫ్రీగానే చూసే వీలు కల్పిస్తూ మిగతా ప్లాట్ ఫామ్స్ కంటే భిన్నంగా ఉండేలా చూస్తున్నాడు ఆహాని.

అడవిలో ‘బందీ’గా హీరో ఆదిత్య ఓం

పైగా సబ్ స్క్రిప్షన్ చార్జీలను కూడా ఇతర ఒటీటీలతో పోల్చితే తక్కువగానే ఉంచి వీక్షకుల్ని బాగానే ఆకర్షించాడు అల్లు అరవింద్. ఇక ప్రస్తుతం ఆహా కోసం కొత్త సినిమాల్ని కొనే పనిలో భాగంగా చిన్న సినిమాల మేకర్స్ కు అదిరిపోయే ఆఫర్ ఇచ్చాడు. సినిమా అందరికి నచ్చేలా ఉంటే.. భారీ మొత్తం ఇచ్చి సినిమాని తీసుకుంటామని చోటా నిర్మాతలకు బడా ఆఫర్ ఇచ్చాడు. దీని కోసం ప్రత్యేకమైన స్క్రీన్ లను తన ఆఫీస్ లో ఏర్పాటు చేశారు. మరి చిన్న సినిమాలకు ఇది బంఫర్ ఆఫరే.