https://oktelugu.com/

రాజకీయాల్లో పవన్ పై పెరిగిన ఒత్తిడి?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ ఒత్తిళ్ళు పెరిగినట్లుగా తెలుస్తోంది.ఒకప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో చక్రం తిప్పిన ముద్రగడ పద్మనాభం, రాజకీయాల నుండి, కాపు ఉద్యమం నుండి ఒక్కసారిగా తప్పుకోవడంతో అందరూ అనేక విశ్లేషణలు ఇచ్చేశారు. కొందరు అధికార పార్టీ ఒత్తిడి అన్నారు… మరి కొందరు కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్ల అని అన్నారు. అయితే ఇక్కడ ముద్రగడ తర్వాత కాపులు నడిపించే నాయకుడు ఎవరు? అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది. సాధారణంగా చూసుకుంటే కులాలకు సంబంధం లేకుండా తెలుగు ప్రజల […]

Written By:
  • Neelambaram
  • , Updated On : July 20, 2020 / 09:15 PM IST
    Follow us on

    జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై రాజకీయ ఒత్తిళ్ళు పెరిగినట్లుగా తెలుస్తోంది.ఒకప్పుడు క్రియాశీలక రాజకీయాల్లో చక్రం తిప్పిన ముద్రగడ పద్మనాభం, రాజకీయాల నుండి, కాపు ఉద్యమం నుండి ఒక్కసారిగా తప్పుకోవడంతో అందరూ అనేక విశ్లేషణలు ఇచ్చేశారు. కొందరు అధికార పార్టీ ఒత్తిడి అన్నారు… మరి కొందరు కాపుల్లో ఐక్యత లేకపోవడం వల్ల అని అన్నారు. అయితే ఇక్కడ ముద్రగడ తర్వాత కాపులు నడిపించే నాయకుడు ఎవరు? అన్నది పెద్ద ప్రశ్నగా మిగిలిపోయింది.

    సాధారణంగా చూసుకుంటే కులాలకు సంబంధం లేకుండా తెలుగు ప్రజల ఆదరణ సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ తాను కులాలకి, మతాలకి ప్రాధాన్యత ఇవ్వనని అన్నప్పుడు కాపు వర్గానికి చెందిన వారు కొద్దిగా మనస్తాపానికి గురయ్యారు. అయినా ప్రజాదరణ ఉన్న తమ వర్గానికి చెందిన నేత పై ఇటువంటి కారణంతో విమర్శలు చేయడం సరికాదన్న ఉద్దేశంతో వారంతా పవన్ విషయంలో మౌనంగా ఉన్నారు. ఇక ఇప్పుడు ముద్రగడ తప్పుకోవడంతో తర్వాత వారి చూపంతా పవన్ కళ్యాణ్ పైనే పడింది. స్థానికంగా ఉండే సమస్యలతో పాటు మిగిలిన సామాజికవర్గాల తో పోలిస్తే కాపు ఓటు బ్యాంకు సమీకరణం కాలేదని విమర్శ ఉండేది. ఎవరికి వారు గా చెల్లాచెదురై ఉన్న తమ వర్గాన్ని ఒకటిగా చేసే శక్తి ఉన్న నాయకుడు ఎవరూ లేరని ఆవేదన ఆ వర్గానికి చెందిన వారిలో ఎప్పటినుంచో వినిపిస్తూనే ఉంది. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ పైన ఈ దిశగా ఒత్తిడి పెరుగుతోంది.

    పవన్ కు వారికి సారథ్యం వహించేందుకు ఇబ్బంది ఏమీ లేదు కానీ అతను చంద్రబాబు తో చేసిన కొన్నాళ్ళ స్నేహానికి ఇప్పటికీ అతనిని చంద్రబాబు బంటుగా వైసిపి వారు ముద్ర వేశారు. మెజారిటీ తెలుగు ప్రజల్లో అదే భావన నాటుకొని పోయింది. ఈ సమయంలో ఆయన కనుక ఇటువంటి సారథ్యాన్ని స్వీకరిస్తే తన మిగిలిన రాజకీయ జీవితం మొత్తం కాపు నేతగా ముద్ర పడిపోతుందేమో అని భయం ఒక వైపు ఉంటే మరో వైపు అతను నమ్మిన సిద్ధాంతాలను రాజకీయ లబ్దికోసం పణంగా పెట్టలేనని పవన్ ఆలోచిస్తున్నాడు. చిరంజీవి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తొలినాళ్లలో ఆయన్ను కాపుల నేతగా వైఎస్ విజయవంతంగా ముద్ర వేయటాన్ని మర్చిపోలేం. ఈ ముద్ర ప్రభావం ప్రజారాజ్యం మీద పడిన వైనాన్ని ఒప్పుకు తీరాల్సిందే. మళ్లీ పవన్ కు అలాంటి పరిస్థితే ఎదురైతే..ఆయన రాజకీయ ఫ్యూచర్ కు ఇబ్బంది తప్పదు.

    ఇక పవన్ కొందరివాడుగా పేరు తెచ్చుకోకుండా అందరివాడే ఎదిగేందుకు ఇంకా చాలా సమయం పడుతుంది కాబట్టి ముందు తన వర్గపు ఓటు బ్యాంకును బలపరచుకోవాలన్న వాదన కూడా జనసేన నాయకుల్లో విపరీతంగా వినిపిస్తోంది..! మరి పవన్ దారెటు?