Sunny Leone : సన్నీలియోన్ ఒకప్పుడు పోర్న్ ప్రపంచాన్ని కుదిపేసిన అమ్మడు. భారతీయ మూలాలున్న కెనడా అమ్మాయి. చిన్ననాటి నుండి పోర్న్ స్టార్ కావాలనే ఆసక్తితో ఆ రంగంలోకి వెళ్లిన సన్నీలియోన్ తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకొని తర్వాత బాలీవుడ్ కి వచ్చి స్థిరపడిన విషయం తెలిసిందే. బాలీవుడ్ కి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు ఎదురైనా కానీ నిలబడి తానేంటో రుజువు చేసుకుంది. ఆమె కథను ఆధారంగా చేసుకొని సన్నీలియోన్ మీద బయోపిక్ కూడా రావడం జరిగింది.
దీని గురించి ఒక ఇంటర్వ్యూ లో సన్నీలియోన్ మాట్లాడుతూ ‘ఈ సినిమాలో నా పోర్న్ లైఫ్ కి సంబంధించిన అన్ని విషయాలు ఇందులో చూపించడం జరిగింది. ఎక్కడ ఏమి దాచకుండా తెరకెక్కించడం తో ఈ సినిమాను మా తమ్ముడు చూడలేదు. నేనే వద్దని చెప్పాను. ఒక అక్కగా నా తమ్ముడు నా పోర్న్ లైఫ్ ని చూడకూడదు అనే ఉద్దేశ్యంతో చెప్పను. ప్రస్తుతం నేను ఆ ఇండస్ట్రీలో లేను, అది గడిచిపోయిన కాలం. దాని గురించి ఎప్పుడు నేను బాధ పడలేదు. ప్రస్తుతం నా లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న’ అంటూ ఆ ఇంటర్వ్యూలో తన అభిప్రాయాలు వెల్లడించింది.
2011 లో జరిగిన బిగ్ బాస్ 5 వంటి రియాలిటీ షోలో పాల్గొన్న సన్నీలియోన్ బాలీవుడ్ నటిగా అవకాశమందుకొన్నది. బాలీవుడ్ సినిమా దర్శకురాలు, నిర్మాత అయిన పూజాభట్ నిర్మించిన జిస్మ్ 2 లో ప్రధాన పాత్ర పోషించింది. రాగిణి MMS 2 అనే మరో బాలీవుడ్ చిత్రంలో నటించింది. మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగ మొదలైన సినిమాల్లో నటించి మెప్పించింది.