Young Heroine: ఫోటోలో ముద్దుగా నవ్వుతున్న బుజ్జి పాపను గుర్తుపట్టగలరా. ఈ క్యూట్ బేబీ ఒక స్టార్ కిడ్. తల్లిదండ్రుల బాటలోనే పరిశ్రమలో అడుగు పెట్టింది. ఇప్పుడు హీరోయిన్ గా ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంటుంది. నటన పై ఆమెకున్న ప్రేమతో ఇంటర్ పూర్తి చేసిన వెంటనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది. హిట్లు ప్లాప్లులు లెక్కచేయకుండా స్టార్ హీరోయిన్ కావాలనే లక్ష్యంతో నిర్విరామంగా ప్రయత్నిస్తుంది ఆ యంగ్ బ్యూటీ.
ఈ క్యూట్ పాప ఓ స్టార్ కపుల్ ముద్దుల కూతురు. ఆమె ఎవరో కాదు ఒకప్పటి స్టార్ హీరో, యాంగ్రీ యంగ్ మ్యాన్ రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక రాజశేఖర్. ఈ ముద్దుగుమ్మ 2019లో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన దొరసాని సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయం అయ్యింది. భారీ అంచనాల నడుమ వచ్చిన ఈ చిత్రం ఆశించినంత ఫలితం ఇవ్వలేదు. కానీ శివాత్మిక నటనకు మంచి మార్కులు పడ్డాయి.
Also Read: BB4: బాలయ్య బోయపాటి కాంబోలో వస్తున్న సినిమాలో నటించనున్న యంగ్ హీరో…
తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. ఆమె నటనకు గాను సైమా అవార్డు అందుకుంది. ఆ తర్వాత తెలుగులో వరుస ఆఫర్లు అందుకుంది. ఆకాశం, పంచతంత్రం, రంగమార్తాండ వంటి సినిమాల్లో నటించింది. వైవిధ్యమైన, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటుంది. ఇటీవల విద్య వాసుల అహం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించింది.
భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తోంది. తమిళ్ లో నితం ఓరు వనం, ఆనందం విలాయుధం వీడు సినిమాల్లో నటించింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వక ముందు శివాత్మిక తన తన తండ్రి రాజశేఖర్ హీరోగా నటించిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం కెరీర్ లో నిలదొక్కుకునే ప్రయత్నాలు చేస్తుంది.
Also Read: Bollywood Actress: సినిమాలు తక్కువే.. కానీ సంపాదన అదుర్స్..