London: లండన్‌ బీచ్‌లో ఏపీ యువకుడి మృతి.. ఉన్నత చదువుల కోసం వెళ్లి..

పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం క ఓనూరు గ్రామానికి చెందిన యువకుడు గుంటుపల్లి సాయిరాం(25) ఉన్నత చదువుల కోసం 2021లొ లండన్‌ వెళ్లాడు.

Written By: Raj Shekar, Updated On : June 11, 2024 1:27 pm

London

Follow us on

London: ఉన్నత చదువుల కోసం వెళ్లిన భారతీయ విద్యార్థులను విధి పగబడుతున్నట్లు కనిపిస్తోంది. అమెరికాలో రోడ్డు ప్రమాదాల రూపంలో విద్యార్థులను మృత్యువు కబళిస్తుండగా, కొందరు హత్యకు గురయ్యారు. కెనడాలో ఓ పంజాబీ యువకుడిని కాల్చి చంపారు. తాజాగా లండన్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ యువకుడు ప్రమాదవ శాత్తు మృతిచెందాడు.

ఏం జరిగిందంటే..
పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం క ఓనూరు గ్రామానికి చెందిన యువకుడు గుంటుపల్లి సాయిరాం(25) ఉన్నత చదువుల కోసం 2021లొ లండన్‌ వెళ్లాడు. అక్కడి హీట్‌పోర్ట్ షైన్‌ యూనివర్సిటీలో ఉన్నత విద్య అభ్యసించాడు. ప్రస్తుతం మాంచెస్టర్‌లోని పోర్టులో పనిచేస్తున్నాడు.

ఈ నెల 2న బీచ్‌కు వెళ్లి..
లండన్‌లోని లాన్‌షైర్‌ దగ్గరలో ఉన్న బ్లాక్‌ పూల్‌ బీచ్‌కు సాయిరాం జూన్‌ 2న వెళ్లాడు. రాత్రి ప్రమాదవశాత్తు చనిపోయాడు. ఈమేరకు సోమవారం మధ్యాహ్నం పోలీసులకు సమాచారం అందింది. మృతదేహాన్ని పోలీసులు లంనడ్‌లోని బ్లాక్‌పూల్‌ విక్టోరియా ఆస్పత్రి మార్చురీకి తరలించారు.

ఐదేళ్ల క్రితం తండ్రి మృతి..
పల్నాడు జిల్లా కోనూరుకు చెందిన ఏడుకొండలు, అన్నపూర్ణమ్మ దంపతులకు కిరణ్‌సాయి, సాయిరాం ఇద్దరు సంతానం. ఏడుకొండలు ఐదేళ్ల క్రితం మృతిచెందాడు. ప్రస్తుతం తల్లి అన్నపూర్ణమ్మ తీర్థయాత్రలకు షిర్డీ వెళ్లింది. ఈ క్రమంలోనే లండన్ నుంచి కుటుంబ సభ్యులకు విషాద వార్త అందింది. దీంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. సాయిరాం మృతదేహాన్ని త్వరగా స్వదేశానికి రప్పించాలని బంధువులు కోరుతున్నారు.