Bigg Boss 9 top contestant: ఈ ఫొటోలో కనిపిస్తున్న చిన్నారి ఎవరో గుర్తు పట్టారా..?, ప్రస్తుతం ఈమె బిగ్ బాస్ సీజన్ 9(Bigg Boss 9 Telugu) లో ఒక కంటెస్టెంట్ గా కొనసాగుతోంది. పైన కనిపిస్తున్న ఫోటో రామ్ పోతినేని హీరో గా నటించిన ‘గణేష్’ చిత్రం లోనిది. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా 2009 వ సంవత్సరం లో విడుదలై పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. ఇందులో రామ్ తో పాటు ఒక్క పిల్లల గ్యాంగ్ ఉంటుంది. ఈ ఎపిసోడ్స్ మొత్తం మూవీలో చాలా బాగుంటాయి. కానీ ఎందుకో ఆరోజుల్లో ఆడియన్స్ కి ఈ చిత్రం ఎక్కలేదు. ఎందుకంటే ఈ సినిమా రన్ అవుతున్న సమయం లోనే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘మగధీర’ చిత్రం సెన్సేషనల్ థియేట్రికల్ రన్ తో ముందుకు పోతోంది. అలాంటి సినిమాని చూసిన ఆడియన్స్ ఇలాంటి చిత్రాలను నచ్చడం కష్టమే.
అయితే పైన కనిపిస్తున్న చిన్నారి మరెవరో కాదు, బిగ్ బాస్ సీజన్ 9 లో సామాన్యుల క్యాటగిరీలో హౌస్ లోకి వైల్డ్ కార్డు గా అడుగుపెట్టిన దివ్య నిఖిత. అగ్నిపరీక్ష షో సమయంలో ఈమె అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చింది. కానీ ఎందుకో ఈమెని ఆడియన్స్ మొదట్లో నచ్చలేదు. అందుకే గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ రోజు ఈమె హౌస్ లోకి అడుగుపెట్టలేకపోయింది. వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ గా నాల్గవ వారం లో ఈమెతో పాటు షకీబ్, నాగ ప్రశాంత్ మరియు అనూష రత్నం హౌస్ లోకి వచ్చారు. కానీ కేవలం దివ్య మాత్రమే సెలెక్ట్ అయ్యింది. హౌస్ మేట్స్ కూడా ఈమె లోపలకు రావాలని ఎవ్వరూ కోరుకోలేదు. అందరికంటే తక్కువ ఓట్లు వచ్చాయి కాబట్టే ఈమె హౌస్ లోకి వచ్చింది. హౌస్ లోకి వచ్చిన రోజు నుండి భరణి తో అన్న అనే బాండింగ్ ని పెట్టుకొని, తనూజ, భరణి మధ్య ఉన్న రిలేషన్ ని దెబ్బ తీసింది.
కేవలం ఈమె కారణంగానే భరణి ఒకసారి నెగిటివ్ అయ్యి ఎలిమినేట్ అయ్యాడు. ఇప్పుడు ఆయన రీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన గేమ్ పై ఈమె కారణంగా ప్రభావం పడుతోంది. కాసేపటి క్రితమే విడుదలైన ప్రోమో ని మీరంతా చూసే ఉంటారు. ఈ ప్రోమో లో కెప్టెన్సీ టాస్క్ నుండి దివ్య తనూజ ని తొలగిస్తుంది. తనూజ పూర్తిగా ఎమోషనల్ అయ్యి, లోపలకు వెళ్లి ఏడుస్తోంది. భరణి కారణంగా ఆ అమ్మాయి నాపై జలసీ పెంచుకుంది, ఆమె కారణంగా నా గేమ్ ఎఫెక్ట్ అవుతోంది అంటూ తనూజ ఒక రేంజ్ లో ఏడవడం మొదలు పెట్టింది. ఇక ఈరోజు ఎపిసోడ్ ఎహ్ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.