The Great Pre -Wedding Show Review: డైరెక్షన్ : రాహుల్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : సందీప్ అగరం
ఆర్టిస్టులు : తిరువీర్, టీనా శ్రావ్య, నరేంద్ర రవి, రోహన్ తదితరులు…
మ్యూజిక్ : సురేష్ బొబ్బిలి…
సినిమా తీయడం అనేది ఒక ఆర్ట్…దానిని ఎంత గొప్పగా తీస్తే అంత మంచి పేరైతే వస్తోంది…కథ, డైరెక్షన్ మీద డైరెక్టర్ ఎంత ఎఫెక్టివ్ గా వర్క్ చేసిన ఫైనల్ గా దానికి స్క్రీన్ మీద ప్రాణం పోయాల్సింది మాత్రం నటుడే…అందుకే ఒక సినిమా తీయడానికి దర్శకులు ఆ కథకి సెట్ అయ్యే నటులను వెతుకుతారు. వాళ్ళు మాత్రమే దానికి న్యాయం చేస్తారు…ఇక ఇండస్ట్రీ లో యంగ్ హీరోలు ఎంత మంది ఉన్నప్పటికి థియేటర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీ కి పరిచయం అయిన నటుడు ‘తిరువీర్’… జార్జ్ రెడ్డి సినిమాలో విలన్ గా నటించిన ఆయన ఆ తర్వాత పలాస, మసుదా, పరేషాన్ లాంటి సినిమాలతో గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక తిరువీర్ హీరోగా రాహుల్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది… అసలు ఈ సినిమాలో ఏముంది.? దర్శకుడు ఏం చెప్పాలనుకున్నాడు? ప్రేక్షకుడు ఎలా రిసీవ్ చేసుకున్నాడు అనేది మనం చర్చించుకుందాం…
కథ
శ్రీకాకుళం ప్రాంతంలోని ఒక మారుమూల గ్రామంలో రమేష్ (తిరువీరు) అనే వ్యక్తి ఫోటో స్టూడియో తో పాటు జిరాక్స్ సెంటర్ నడిపిస్తుంటాడు. దాంతో పాటుగా కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లకు ప్రీ వెడ్డింగ్ షూట్ కూడా చేసి పెడతాడు.తనకి అసిస్టెంట్ గా రాము (రోహన్) ఉంటాడు. రమేష్ ఫోటో స్టూడియో కి ఎదురుగా ఉండే పంచాయతీ ఆఫీస్ లో హేమా (టీనా) అనే అమ్మాయి పనిచేస్తోంది…వీళ్ళిద్దరి మధ్య ప్రేమించుకుంటారు. తొందర్లోనే పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటారు. రమేష్ తను పెళ్లి చేసుకునేలోపు కొన్ని డబ్బులు సంపాదించాలనుకుంటాడు.సరిగ్గా అదే సమయంలో ఆ ఊరిలో ఉన్న ఆనంద్ కి పెళ్లి కుదురుతుంది.
ఎమ్మెల్యే కి దగ్గరి మనిషి అయిన ఆనంద్ (నరేంద్ర రవి) తను ఇష్టపడిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్న సంతోషంలో ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనుకుంటాడు. ఇక ఆ ఏరియాలో ప్రీ వెడ్డింగ్ షూట్స్ తీయడంలో ఫేమస్ అయిన రమేష్ తో లక్షన్నర కి బేరం కుదుర్చుకొని ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకుంటాడు…ఇక మరో రెండు రోజుల్లో పెళ్లి ఉందనగా రమేష్ అసిస్టెంట్ అయిన రాము వల్ల ఆనంద్ వాళ్ల ప్రి వెడ్డింగ్ షూట్ చేసిన మెమోరీ చిప్ మిస్ అవుతోంది. దానివల్ల రమేష్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడు? ఆనంద్ కి ఈ విషయం తెలిసి ఎలా రియాక్ట్ అయ్యాడు? రాము కావాలనే ఈ చిప్ మిస్ చేశాడా? ఆనంద్ చిప్ ఇవ్వకపోతే రమేష్ హేమా ల పెళ్లి కూడా ఆగిపోతుందా? అసలు హేమ కి ఆనంద్ కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి? మొత్తానికి రమేష్ ఈ ప్రాబ్లం నుంచి బయటపడ్డాడా లేదా అనేది తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
డైరెక్టర్ రాహుల్ ప్రజెంట్ ట్రెండ్ లో ఉన్న ప్రీ వెడ్డింగ్ షూట్ అనే పాయింట్ ను తీసుకొని దాన్ని బాగా ఓన్ చేసుకున్నాడు… ప్రి వెడ్డింగ్ షూట్స్ వల్ల కొత్తగా పెళ్లి చేసుకోబోతున్న కపుల్స్ కి ఎలాంటి లాభాలు ఉన్నాయి..వాటివల్ల ఇంకెలాంటి ఇబ్బందులు వస్తున్నాయి అనేది కూడా కొన్ని సీన్స్ ద్వారా క్లియర్ గా చూపించాడు… ఇక మొదటి నుంచి ఆయన ఈ సినిమాను కామెడీ వే లోనే ప్రజెంట్ చేశాడు…ఫస్టాఫ్ లో చాలా కామెడీ సీన్స్ మన నిజ జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రేక్షకుడు వాటికి కనెక్ట్ అవుతాడు…చాలా తక్కువ క్యారెక్టర్స్ తో కథను రాసుకున్నప్పటికి ఊరిలో ఉన్న జనాల మనస్త్వతలు ఎలా ఉంటాయి. అనేది కూడా చాలా బాగా చూపించాడు.
ప్రీ వెడ్డింగ్ షూట్ కోసం డిఫరెంట్ లోకేషన్స్ లో చేసిన ఒక మాంటెజ్ సాంగ్ చాలా బాగా పిక్చరైజ్ చేశారు… అది చూస్తే కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకునే వాళ్లకి సైతం అర్జెంట్ గా ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకోవాలనే కుతూహలం పుడుతోంది… సెకండాఫ్ లో కొన్ని కామెడీ సీన్స్ అనుకున్న రేంజ్ లో వర్క్ కానప్పటికి ఎమోషనల్ సీన్స్ బాగా ఎలివేట్ అయ్యాయి… దానివల్ల ఫస్టాఫ్ కామెడీగా సెకండాఫ్ ఎమోషనల్ గా సాగుతోంది…
తిరువీర్ పాత్రను మలిచిన తీరు బాగుంది… ఆయన అమాయకపు ఫేస్ తో ప్రీ వెడ్డింగ్ షూట్ చేస్తుంటాడు. ఆ షూట్ చేసేటప్పుడు వాళ్ళతో ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి అనేది కూడా చాలా క్లియర్ గా చూపించే ప్రయత్నం చేశారు…ఇక హీరోయిన్ పాత్ర ను మలిచిన తీరు బాగుంది… ఆమె పాత్రకి స్కోప్ ఉండటంతో టీనా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది… ఈ సినిమా మొత్తానికి హైలెట్ ఎవరంటే నరేంద్ర రవి ఈయన ఇంతకు ముందు ఒకటి, రెండు సినిమాల్లో నటించినప్పటికి వాటితో ఆయనకి పెద్దగా గుర్తింపైతే రాలేదు…కానీ ఈ సినిమాలో ఆయన కామెడీకి నవ్వని ప్రేక్షకుడు ఉండడు…ఈయన ఫీచర్ లో చాలా మంచి కమెడియన్ అవుతాడు…మాస్టర్ రోహన్ కూడా చాలా మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు…
సురేష్ బొబ్బిలి అందించిన మ్యూజిక్ బాగున్నప్పటికి అందులో ఏదో స్పార్క్ తగ్గిందనే ఫీల్ కలుగుతోంది…ముఖ్యంగా ఆయన ఇచ్చిన సాంగ్స్ కంటే సెకండాఫ్ లో కొన్ని ఎమోషనల్ సన్నివేశాల్లో ఆయనిచ్చిన బ్యా గ్రౌండ్ స్కోర్ బాగా వర్కౌట్ అయింది…సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఆ ఎమోషనల్ సీన్స్ కి కనెక్ట్ అవ్వడానికి ఆయన తన బిజీయంతో ప్రాణం పోశాడు…సినిమాటోగ్రఫీ కూడా కథలోని సీన్స్ ను బట్టి చాలా డీసెంట్ గా ఉంది. కొన్ని స్టడీ షాట్స్ పెట్టినప్పటికి సినిమా మూడ్ ను చెడగొట్టకుండా చాలా బాగా చేశారు… ఎలాంటి హంగులు ఆర్భాటాలు లేకుండా కొన్ని వైడ్ షాట్స్, క్లోజ్ లతో మూవీని ముగించారు…
ఇందులో బాగోలేనివి ఇవే
సెకండాఫ్ లో కొన్ని సీన్స్ కావాలని ఇరికించినట్టుగా అనిపించాయి…
నరేంద్ర రవి తప్ప మిగతావాళ్ళ కామెడీ సీన్స్ అంత ఎఫెక్టివ్ గా వర్కౌట్ కాలేదు…
ఇందులో బాగున్నవి ఇవే
స్టోరీ
డైరెక్షన్
తిరువీర్ యాక్టింగ్
నరేంద్ర రవి యాక్టింగ్
బిజియం
ఫైనల్ కార్డ్ : ఈ వీకెండ్ ఫ్యామిలీ తో చూసి ఎంజాయ్ చేయవచ్చు…
రేటింగ్ : 3/5
ఓవరాల్ గా ఈ సినిమా కథ ఈ జనరేషన్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతోంది… ఫ్యామిలీ సినిమాలు రావడం లేదు అనుకునే వాళ్లకోసమే తీసిన సినిమా…హ్యాపీగా చూసి హాయిగా ఎంజాయ్ చేయండి…