https://oktelugu.com/

Senior Heroes: సిల్వర్‌స్క్రీన్‌పై కొడుకుల‌తో సీనియ‌ర్ హీరోలు.. వెరీ స్పెషల్ మూవీస్

Senior Heroes: స్టార్ హీరోల మూవీ రిలీజ్ వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగే.. అలాంటి ఆ స్టార్ హీరో తన వారసుడితో కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఇక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులుండువు. అలాంటి మూవీస్ ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఏయే స్టార్ హీరోలు తమ వారసులతో కలిసి ఏయే మూవీస్‌లో యాక్ట్ చేస్తున్నారో తెలుసుకుందామా..? మెగాస్టార్ చిరంజీవి.. చాలా రోజు తర్వాత ఆయన యాక్ట్ చేసిన ఖైదీ నంబర్ 150 మూవీలో రామ్ చరణ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 14, 2021 / 03:03 PM IST
    Follow us on

    Senior Heroes: స్టార్ హీరోల మూవీ రిలీజ్ వస్తుందంటే ఫ్యాన్స్‌కు పండగే.. అలాంటి ఆ స్టార్ హీరో తన వారసుడితో కలిసి ఒకే స్క్రీన్ పై కనిపిస్తే ఇక ఫ్యాన్స్ ఆనందానికి హద్దులుండువు. అలాంటి మూవీస్ ప్రస్తుతం విడుదలకు సిద్ధమవుతున్నాయి. మరి ఏయే స్టార్ హీరోలు తమ వారసులతో కలిసి ఏయే మూవీస్‌లో యాక్ట్ చేస్తున్నారో తెలుసుకుందామా..?

    Senior Heroes

    మెగాస్టార్ చిరంజీవి.. చాలా రోజు తర్వాత ఆయన యాక్ట్ చేసిన ఖైదీ నంబర్ 150 మూవీలో రామ్ చరణ్ గెస్ట్ రోల్ లో ఎంట్రీ ఇచ్చి చిరంజీవితో కలిసి స్టెప్పులేశారు. ఇక తర్వాత వీరిద్దరి కాంబినేషనల్‌లో ఆచార్య మూవీ తెరకెక్కుతోంది. ఈ మూవీ కొరటాల శివ డైరెక్షన్ లో రాబోతోంది. ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్ అందిస్తుండగా, ఫిబ్రవరి 4న రిలీజ్ కానుంది.

    టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన నాగార్జున తన కొడుకు నాగచైతన్యతో బంగార్రాజు మూవీలో యాక్ట్ చేస్తున్నారు. వీరద్దరి కాంబినేషన్‌లో మనం అనే బ్లాక్ బస్టర్ మూవీ వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తెరకెక్కుతున్న బంగార్రాజు రాబోతోంది. ఈ మూవీలో నాగచైతన్య కీ రోల్‌లో యాక్ట్ చేస్తున్నట్టు టాక్.

    రెబల్ స్టార్ కృష్ణం‌రాజు.. మన ముందు తరం వారికి ఈయన చాలా ఫేమస్. ప్రస్తుతం ప్రభాస్ యాక్ట్ చేస్తున్న రాధేశ్యామ్ మూవీలో కృష్ణం రాజు సైతం కనిపించనున్నారు. ఇప్పటికే వీరు కాంబినేషన్‌లో మాస్ మూవీ రెబల్ వచ్చి ఒక ఊపు ఊపింది. ప్రస్తుతం వీరి కాంబినేషన్ లో వస్తున్న రాధేశ్యామ్ మూవీపై చాలా అంచనాలు ఏర్పడ్డాయి. రాధాకృష్ణ కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీ జనవరి 14న రిలీజ్ కానుంది.

    Also Read: Bangarraju Movie: ” పార్టీ సాంగ్ ఆఫ్ ది ఇయర్ ” ను అనౌన్స్ చేసిన బంగార్రాజు టీమ్…

    చియాన్ విక్రమ్.. ఈ పేరు చెబితే ఎన్నో డిఫరెంట్ స్టోరీస్ ఉన్న మూవీసే గుర్తొస్తాయి. అపరిచితుడు మూవీతో భిన్నమైన కథలను ఎంపిక చేసుకోవడం ప్రారంభించిన విక్రమ్.. ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ అందుకున్నాడు. అర్జున్ రెడ్డి రీమేక్ తో వెండితెరకు పరిచయమ్యాడు ఆయకు కుమారుడు ధ్రువ్. వీరిద్దరి కాంబినేషన్‌లో మహాన్ అనే మూవీ తెరకెక్కతున్నది. కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది రిలీజ్ కానుంది.

    Also Read: Telugu Movies: సినిమాల పై మోజు.. మరి దర్శకుడు అయ్యేది ఎలా ?

    Tags