Thimmaraju Palli TV Twitter Review: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి, తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కుని ఏర్పాటు చేసుకున్న హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram). ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టే ముందు ఇతను ఎన్నో సవాళ్ళను ఎదురుకోవాల్సి వచ్చింది. బోలెడంత టాలెంట్ ఉన్నప్పటికీ కూడా అవకాశాలు కోసం ఎదురు చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాంటి స్థాయి నుండి ఇప్పుడు ఈ రేంజ్ కి రావడం అనేది సాధారణమైన విషయం కాదు. బ్యాక్ గ్రౌండ్ ఇమేజ్ లేకుండా ఒక కొత్తవాడు ఇండస్ట్రీ లోకి అడుగుపెడితే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలిసినవాడు కాబట్టి , తనలాగా కష్టపడే తత్త్వం, టాలెంట్ ఉన్న కొత్త కుర్రాళ్లను ప్రోత్సహిస్తూ ‘తిమ్మరాజు పల్లి టీవీ’ అనే చిత్రాన్ని నిర్మించాడు. విడుదలకు ముందు తనదైన రీతిలో ప్రొమోషన్స్ చేసి నెటిజెన్స్ ఈ చిత్రం గురించి మాట్లాడుకునేలా చేయడం లో కిరణ్ అబ్బవరం సక్సెస్ అయ్యాడు.
Pure Vintage Village Vibess
Vintage Hero References
Music too GoodInterval And Climax Chala Baga Teesaru
Must watch in THEATRES
Congratulations anna @Kiran_Abbavaram #ThimmarajupalliTV pic.twitter.com/cEwcnMPk3Y— _ (@Sai_PSPK18) April 17, 2026
అలా నేడు మంచి బజ్ తో థియేటర్స్ లోకి విడుదలైన ఈ చిత్రానికి ట్విట్టర్ ఆడియన్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ఇప్పుడు మనం చూద్దాం. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బోరింగ్ స్క్రీన్ ప్లే తో నడుస్తుందని చూసిన వాళ్ళు చెప్తున్న మాట. టైటిల్ కి తగ్గట్టుగానే కథ మొత్తం టీవీ చుట్టూనే సాగుతుంది , మధ్యలో చిన్న లవ్ స్టోరీ కూడా ఉంటుంది. కానీ ఇంటర్వెల్ లో ఒక ఆసక్తికరమైన ప్లాట్ ని రివీల్ చేస్తాడు డైరెక్టర్. సెకండ్ హాఫ్ లో మిస్టరీ ఎలిమెంట్ గా సాగే స్క్రీన్ ప్లే పర్ఫెక్ట్ గా కుదిరింది. డైరెక్టర్ మునిరాజు కి ఇది తొలిసినిమానే అయినప్పటికీ ఎక్కడా కూడా అనుభవ లేమి కనిపించలేదు. ఈ సినిమాకు మెయిన్ హైలైట్ గా నిల్చింది ఏదైనా ఉందా అంటే అది బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్. పెద్దగా పేలని సన్నివేశాలను కూడా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ పైకి లేపింది.
Just Now Completed Watching #ThimmarajupalliTV ✅
Cinema Lo Main Highlight Music
Intha Chinna Cinema Nundi Ah Visuals Ni Asalu Expect Cheyaledhu
Finally Kiran Abbavaram Production Nundi Vachina First Movie Hit KottesindiOverall Must Watch Bomma ❤️
My Rating 3.4/5 https://t.co/g8Y8AdPJty— #OneBadHabit (@SravanTweetz) April 17, 2026
ఒక్కమాటలో చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్ ఈ సినిమాకు మెయిన్ హీరో అని చెప్పొచ్చు. ఫస్ట్ హాఫ్ లో రూరల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే లవ్ స్టోరీ కొంతమందికి నచ్చొచ్చు కానీ, కొత్తదనాన్ని కోరుకునే వాళ్లకు మాత్రం బోరింగ్ గా అనిపిస్తుంది. ఇక క్లైమాక్స్ ఈ సినిమాకు గుండె లాంటిది. లాజికల్ గా అన్ని పాయింట్స్ ని కనెక్ట్ చేస్తూ , డైరెక్టర్ ఈ చిత్రాన్ని ముగించిన తీరు అద్భుతం. ఇక నిర్మాతగా కిరణ్ అబ్బవరం కూడా ప్రొడక్షన్ విలువలు బాగుండేలా చూసుకున్నాడు. ఈ కథ కి ఎంత ఖర్చు చెయ్యాలో అంతే ఖర్చు చేసాడు తప్ప, ఎక్కడా కూడా వృధా ఖర్చులు. ఓవరాల్ గా ఈ వీకెండ్ విడుదలైన సినిమాల్లో ది బెస్ట్ మూవీ గా ‘తిమ్మరాజు పల్లి టీవీ’ ని చెప్పుకోవచ్చు అని అంటున్నారు ట్విట్టర్ ప్రేక్షకులు.
Done with my show✅
Interval bang nundi climax varaku full engaging undhi movieNew faces but screen meeda full confidence kanipinchindiLove track subtle ga undi, mother sentiment strong ga connect avuthayi…Bgm & Songs
Overall small Movie big impact#ThimmarajupalliTV https://t.co/SZbxCbny2A
— RoaringTiger (@RoaringVibes1) April 17, 2026
oka heart touching village cinema. Songs, emotions, village feel anni perfect ga set ayyayi. Village definitely chudalsina cinema.lo songs highlight ani cheppochu. Folk style lo unna songs chala fresh ga untai. hit bomma !! #ThimmarajuPalliTV https://t.co/9UfoTuftvG
— cultt.tejjjj (@tej_balaji_9) April 17, 2026
#ThimmarajupalliTV what a movie… Chala days tarvatha manchi rural based drama movie chusa.. main leads and even supporting artists acting kuda too good.. music big plus… Climax super undhi.. ⭐⭐⭐ https://t.co/05BMDP34VW
— Charan RC™ (@OutOfParkKannad) April 17, 2026