Homeఎంటర్టైన్మెంట్Lady Power Star Saipallavi Reaction: వాటికి కనెక్ట్ కాను... లేడీ పవర్ స్టార్ బిరుదుపై...

Lady Power Star Saipallavi Reaction: వాటికి కనెక్ట్ కాను… లేడీ పవర్ స్టార్ బిరుదుపై సాయి పల్లవి రియాక్షన్!

Lady Power Star Saipallavi Reaction: లేడీ పవర్ స్టార్ ట్యాగ్ పై సాయి పల్లవి స్పందించారు. బిరుదుల గురించి ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సాయి పల్లవి లేటెస్ట్ మూవీ విరాటపర్వం. ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ పక్కన పెడితే… మంచి సినిమా అనే పేరు తెచ్చుకుంది. రానా-సాయి పల్లవి నటనకు ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా వెన్నెల పాత్రలో సాయి పల్లవి జీవించారు. ప్రేక్షకుల చేత కంట నీరు పెట్టించారు. ఈ క్రమంలో ఆమె పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటున్నారు. తాజాగా సాయి పల్లవి ఓ ఆంగ్ల దినపత్రిక తో మాట్లాడారు .

Lady Power Star Saipallavi Reaction
Sai Pallavi

ఈ సందర్భంగా ఆమె లేడీ పవర్ స్టార్ బిరుదుపై స్పందించారు. మిమ్మల్ని అభిమానులు లేడీ పవర్ స్టార్ అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏమిటని అడుగగా… పేరుకు ముందు ఇలాంటి బిరుదులు నేను ఇష్టపడను. నేను వాటికి కనెక్ట్ కాను. బిరుదులు మనపై ఒత్తిడి పెంచేస్తాయి. ప్రేక్షకులు నన్ను ప్రేమించడానికి, అభిమానించడానికి నేను చేసిన పాత్రలే కారణం. కాబట్టి ఇంకా మంచి పాత్రలు చేసి వాళ్ళ ప్రేమను పొందాలని కోరుకుంటాను. బిరుదులు ఉంటే సరిగా నటించలేను. కాబట్టి సాధారణంగానే ఉండటానికి ఇష్టపడతాను… అంటూ చెప్పుకొచ్చారు.

Also Read: Bandi Sanjay: బీజేపీ సత్తా చాటాలని బండి సంజయ్ తాపత్రయపడుతున్నారా?

సాయి పల్లవిగా పిలిపించుకోవడమే తనకిష్టం అని ఆమె పరోక్షంగా తెలియజేశారు. తాజాగా సాయి పల్లవి అనుకోని వివాదంలో చిక్కుకున్నారు. కాశ్మీర్ ఫైల్స్ మూవీ గురించి సాయి పల్లవి తన అభిప్రాయం చెప్పగా కొందరు ఖండించారు. ఆమెపై విమర్శల దాడికి దిగారు. తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన సాయి పల్లవి, హింస ఏ రూపంలో జరిగినా మంచిది కాదు. కులం, మతం ప్రాతిపదికన మూక హత్యలకు పాల్పడడం సహించారని నేరం అన్నారు. ఈ వివాదంలో నటుడు ప్రకాష్ రాజ్ సాయి పల్లవికి మద్దతు ప్రకటించారు. ఆమె వ్యాఖ్యలను సమర్ధించారు.

Lady Power Star Saipallavi Reaction
Lady Power Star

సినీ నటి, బీజేపీ నేత విజయశాంతి సాయి పల్లవి వ్యాఖ్యలపై మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా సాయి పల్లవిని ఆమె విమర్శించారు. కాగా సాయి పల్లవి గార్గి టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రకటించారు. తెలుగు, కన్నడ, తమిళ భాషల్లో గార్గి విడుదల కానుంది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి 96 ఫేమ్ గోవింద్ వసంత్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Also Read: Posani Sensational Comments On Pawan Kalyan: పవన్ కళ్యాణ్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన పోసాని

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version