Star Comedian Insulted Chiranjeevi: టాలీవుడ్ లో కమెడియన్ బాబు మోహన్ కి ఒక్క ప్రత్యేకమైన స్థానం ఉన్న సంగతి మన అందరికి తెలిసిందే..ఒక కమెడియన్ గా మరియు రాజకీయ నాయకుడిగా బాబు మోహన్ కి మంచి పేరు ప్రఖ్యాతలు ఉన్నాయి..సినిమాల్లోకి అడుగుపెట్టకముందు ఆయన తెలంగాణలోని ఖమ్మం లో రెవిన్యూ ఇన్స్పెక్టర్ గా పని చేసేవాడు..అప్పటికే ఆయనకి వివాహం కూడా అయిపోయింది..ఒక్క పక్క జాబ్ చేస్తూనే ఖాళి సమయం దొరికినప్పుడల్లా నాటకాలు వేస్తూ ఉండేవాడు..ఇది ఆయన సతీమణికి అసలు ఇష్టం ఉండేది కాదు..కానీ నటన అంటే చిన్నప్పటి నుండి పిచ్చి ఉండడం తో తన భార్య కి ఇష్టం లేకపోయినా కూడా నాటకాలు వేస్తూ ఉండేవాడు..నాటకాల మోజులో పడి ఎక్కడ బంగారం లాంటి ఉద్యోగంని పోగొట్టుకుంటాడో అని ఆమె భయం అట..ఈ విషయం లో ఈ ఇద్దరి మధ్య ఎన్నో సార్లు గొడవ అయ్యి నెలలు తరబడి మాట్లాడుకోకుండా ఉండేవారట..అలా కాలం గడిచిపోతున్న సమయం లో ఆయనకి సౌదీ అరేబియా లో ఉద్యోగం వచ్చింది..కానీ ఎందుకో అక్కడ వచ్చే జీతం ఆయనకి సరిపోక సంసారం ని నడపడం అతి కష్టం అయ్యి హైదరాబాద్ కి తిరిగి వచేసాడు.

Also Read: Bandi Sanjay: బీజేపీ సత్తా చాటాలని బండి సంజయ్ తాపత్రయపడుతున్నారా?
హైదరాబాద్ కి వచ్చిన తర్వాత తనకి ఏమి పని చెయ్యాలో తోచక , తనకి ఇష్టమైన సినిమా వృత్తినే ఎంచుకున్నాడు..అప్పట్లో ఈయన అవకాశాల కోసం సారధి స్టూడియోస్ చుట్టూ తిరిగేవాడు..అలా ఒక రోజు సారధి స్టూడియోస్ లో చిరంజీవి హీరోగా తమ్మ రెడ్డి భరద్వాజ నిర్మాతగా, వాసు అనే దర్శకుడితో చేస్తున్న ‘కోతలరాయుడు’ అనే సినిమా షూటింగ్ జరుగుతూ ఉంది..ఆ షూటింగ్ ని చూడడానికి అనుకోకుండా వెళ్ళాడు బాబు మోహన్..అక్కడ షూటింగ్ చేసి బాగా అలసిపోయిన చిరంజీవి కాసేపు విశ్రాంతి తీసుకోవడం కోసం అలా చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చొని ఉన్నాడు..ఇంతలోపు బాబు మోహన్ చిరంజీవి వద్దకి వెళ్లి ‘ఇక్కడ ఏ సినిమా షూటింగ్ జరుగుతుంది అండీ..మీరు ఎవరు..? ఈ సినిమాలో హీరో గా ఎవరు నటిస్తున్నారు’ అని అడిగాడట..అప్పుడు చిరంజీవి బాబు మోహన్ ని క్రింద నుండి పై దాకా ఒక చూపు చూసి ‘ నేనే హీరోని’ అని చెప్పాడట..అప్పటికే చిరంజీవి 10 కి పైగా సినిమాల్లో హీరోగా నటించాడు..వాటిల్లో కొన్ని సూపర్ హిట్ కూడా అయ్యాయి..అయినా కూడా తానూ ఎవరో తెలియనట్టు బాబు మోహన్ అలా అడిగేసరికి చిరంజీవి గారు బాగా ఫీల్ అయ్యారట..ఈ విషయం ని బాబు మోహన్ ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో తెలిపాడు..వాస్తవానికి బాబు మోహన్ అప్పట్లో ఎన్టీఆర్ ,.అనే, కృష్ణ సినిమాలు తప్ప మిగిలిన హీరోల సినిమాలు పెద్దగా సినిమాలు చూసే వాడు కాదట..చిరంజీవి కూడా అప్పట్లో కొత్త హీరో కాబట్టి అప్పట్లో గుర్తు పట్టలేకపోయాను అంటూ చెప్పుకొచ్చాడు బాబు మోహన్.

Also Read: Pawan Kalyan CBN: చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ మైండ్ గేమ్!



[…] […]