Tamil Directors: సినిమాలు తీయడం అనేది ఒక ఆర్ట్ అది అందరికీ రాదు. ఒక సినిమాని సక్సెస్ ఫుల్ గా నిలపాలంటే చాలా టాలెంట్ ఉండాలి. మనం రాసుకున్న కథని స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి దాన్ని ప్రేక్షకుల చేత శభాష్ అనిపించేలా చేయడానికి చాలావరకు కష్టపడాల్సిన అవసరమైతే ఉంటుంది. కొన్ని సంవత్సరాలపాటు తీసిన సినిమాని కేవలం రెండు గంటల్లో ప్రేక్షకులు జడ్జ్ చేస్తారు. ఆ రెండు గంటల్లోనే సినిమా సక్సెస్ అయిందా? ఫెయిల్యూయర్ అయిందా? అనేది తెలిసిపోతోంది. కాబట్టి అలాంటి సినిమా ఫీల్డ్ లో ఉన్న దర్శకులందరు వాళ్ళ సినిమాలను చాలా జాగ్రత్తగా తీయాల్సిన అవసరమైతే ఉంది…ఇక తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ముగ్గురు దర్శకులు మాత్రం కులానికి సంబంధించిన సినిమాలను చేస్తూ సక్సెస్ లను సాధిస్తున్నారు. ఇక ఎందుకని వాళ్ళు వరుసగా అలాంటి సినిమాలు చేస్తున్నారు అనే విషయం మీద కొన్ని అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నప్పటికి వాళ్లు అవేవీ పట్టించుకోకుండా అలాంటి సినిమాలను చేస్తూ సూపర్ సక్సెస్ లను సాధిస్తున్నారు…
Also Read: హత్యకు కుట్ర జరిగినా.. మోడీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు.. ఈ విషయం ఎలా బయటపడింది?
వాళ్ళు ఎవరు అంటే వెట్రీ మారన్, పా రంజిత్, మారి సెల్వరాజ్…ఈ ముగ్గురు దర్శకులు వరుసగా చేస్తున్న సినిమాలన్నీ వెనకబడ్డ కులాలను ఆధారంగా చేసుకొని రాసుకున్న కథలే కావడం విశేషం…వాళ్ళు ఇలాంటి సినిమాలను చేస్తూ సక్సెస్ ని సాధిస్తున్నారు. వెట్రిమారన్ చేసిన అసురన్, పా రంజిత్ చేసిన తంగలన్, మారి సెల్వరాజ్ నాయకుడు లాంటి సినిమాలు సైతం ఈ కోవకి చెందినవే కావడం విశేషం…
ఇక స్టార్ డైరెక్టర్లు అందరు మంచి సినిమాలను చేస్తుంటే వీళ్ళు మాత్రం ఇలాంటి సినిమాలను చేస్తూ ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు…ప్రేక్షకులు సైతం వాళ్ళ సినిమాలను ఆదరించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటున్నారు…
ఇకమీదట కూడా వీళ్ళు చేయబోయే సినిమాలు ఇలానే ఉంటాయా? అంటూ కొంతమంది ప్రేక్షకులు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్..వీళ్ళు సినిమాతో ఎంటర్ టైన్ మెంట్ ను అందిస్తూనే ప్రేక్షకులను ఎడ్యుకేట్ చేయడానికి పోటీ పడుతూ ఉంటారు. ఈ పోటీలో ముగ్గురు సక్సెస్ లను సాధిస్తుండటం విశేషం…