https://oktelugu.com/

Movies: ఓటీటీ- థియేటర్లలో ఈ వారం సందడి చేసే సినిమాలివే!

Movies: ప్రస్తుతం కరోనా వల్ల ఓటీటీల హవా నడుస్తోంది. సీజన్​ ఏదైనా చిన్నా, పెద్ద చిత్రాలనే తేడా లేకుడా అన్నింటిని ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆదరిస్తోంది. మరోవైపు ఇప్పుడిప్పుడే మెల్లగా థియేటర్లు తెరుచుకుంటున్న తరుణంలో కొన్ని సినిమాలు స్క్రీన్​పై పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం కూడా పలు చిత్రాలు థియేటర్​, ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం. రొమాంటిక్​ ఆకాశ్​పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్​. అనిల్​ […]

Written By: , Updated On : October 25, 2021 / 04:57 PM IST
these-movies-are-releasing-this-week-from-ott-and-theaters
Follow us on

Movies: ప్రస్తుతం కరోనా వల్ల ఓటీటీల హవా నడుస్తోంది. సీజన్​ ఏదైనా చిన్నా, పెద్ద చిత్రాలనే తేడా లేకుడా అన్నింటిని ఓటీటీ ప్లాట్​ఫామ్​ ఆదరిస్తోంది. మరోవైపు ఇప్పుడిప్పుడే మెల్లగా థియేటర్లు తెరుచుకుంటున్న తరుణంలో కొన్ని సినిమాలు స్క్రీన్​పై పోటీ పడేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ వారం కూడా పలు చిత్రాలు థియేటర్​, ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిపై ఓ లుక్కేద్దాం.

రొమాంటిక్​

ఆకాశ్​పూరి, కేతికా శర్మ జంటగా నటిస్తున్న చిత్రం రొమాంటిక్​. అనిల్​ పాడూరి దర్శకుడు. మాస్​ డైరెక్టర్​ పూరి జగన్నాథ్​, ఛార్మి సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఈ నెల 29న రిలీజ్​ కానుంది. చిత్రీకరణ ఎప్పటికో పూర్తయినప్పటికీ.. కరోనా వల్ల వాయిగా పడుతూ ఇప్పటికి విడుదలకు నోచుకుంది. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ చూస్తుంటే..  యువతను ఆకట్టుకునేలా ఈ సినిమా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకపాత్ర పోషించారు.

వరుడు కావలెను

లక్ష్మి సౌభాగ్య దర్శకత్వంలో నాగశౌర్య-రీతూవర్మ కలిసి నటించిన సినిమా వరుడు కావలెను. ఫ్యామిలీ ఎంటర్​టైనర్​గా తెరకెక్కిన ఈ చిత్రం అక్టోబరు 29న విడుదల కానుంది. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన దిగు దిగు దిగు నాగ పాట వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తమన్​ స్వరాలు అందిస్తున్నారు.

తీరం

అనిల్‌ ఇనమడుగు హీరోగా నటిస్తూ.. తానే దర్శకత్వం వహించిన చిత్రం తీరం. మరో హీరోగా శ్రావణ్‌ వై.జి.టి కనిపించనున్నారు.  యం.శ్రీనివాసులు నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రాన్ని  ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

రావణలంక

క్రిష్‌ బండిపల్లి, అస్మిత కౌర్‌ జంటగా నటించిన చిత్రం ‘రావణ లంక’. మురళీశర్మ, రచ్చ రవి, దేవ్‌గిల్‌ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. బి.ఎన్‌.ఎస్‌.రాజు దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా అక్టోబరు 29న ప్రేక్షకుల ముందుకు రానుంది.

జై భజరంగి 2

మరోవైపు కన్నడ నటుడు శివరాజ్‌ కుమార్‌ హీరోగా  ఏ.హర్ష తెరకెక్కించిన సినిమా ‘జై భజరంగి 2’. 2013లో వచ్చిన ‘భజరంగి’కి సీక్వెల్‌గా ఈ సినిమా తెరకెక్కించారు. ఈ సినిమా తెలుగు, కన్నడ భాషల్లో ఈనెల 29న విడుదలకు సిద్ధమైంది ఈ సినిమా. ఇటీవలే విడుదలైన ట్రైలర్​ ప్రేక్షకులను అకట్టుకుంటోంది.