Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 లో భాగంగా ప్రస్తుతం ఉన్న కంటెస్టెంట్స్ అందరూ తన తమ వైఖరితో ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక బిగ్ బాస్ ఇచ్చిన టాస్కులను చాలా శ్రద్ధగా ఆడుతూనే అవకాశం దొరికిన ప్రతిసారి ఎవరికి వాళ్ళు హైలెట్ అవ్వాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే చాలా మంచి కంటెస్టెంట్ గా గుర్తింపును సంపాదించుకున్న శేఖర్ బాష మాత్రం రీసెంట్ గా ఎలిమినేట్ అవ్వడం అనేది చాలామందిని బాధపెడుతున్న విషయమనే చెప్పాలి. హౌజ్ లో ఆయన ఎవరితో ఎలాంటి విభేదాలు పెట్టుకోకుండా చాలా జెన్యూన్ గా తన గేమ్ ని ఆడాలనే ప్రయత్నం చేశాడు. ఇక ఈ ప్రయత్నంలోనే ఆయన మెజారిటీ ప్రేక్షకులను సంపాదించుకోలేకపోయాడు. కారణం ఏదైనా కూడా ఒక వ్యక్తి మంచివాడు అనే దానిమీద అయితే అతను బిగ్ బాస్ హౌస్ లో ఒక వారం పాటు కంటిన్యూ అవుతాడు. కానీ ఫైనల్ గా ఆయన్ని నిలబెట్టేది మాత్రం ఆయన పర్ఫామెన్స్ అనే చెప్పాలి… నిజానికి శేఖర్ బాష ఎలిమినేట్ అవ్వడం అనేది ఎవరికీ నచ్చలేదు. ఎందుకంటే ఆయన హౌజ్ లో తన మార్క్ కామెడీ తో ప్రేక్షకులందరినీ నవ్విస్తూ జెన్యూన్ గా గేమ్ ని ఆడుతూ ముందుకు దూసుకెళ్లాడు. మరి ఇలాంటి సందర్భంలో ఆయన ఎలిమినేట్ అవ్వడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే కంటెస్టెంట్స్ అందరూ కలిసి అతన్ని ఎలిమినేట్ చేయించే ప్రయత్నం అయితే చేసినట్టుగా తెలుస్తోంది.
అయితే అందులో భాగంగానే నాగార్జున కూడా ఇందులో భాగమైనట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి. శేఖర్ భాష ని ఎలిమినేట్ చేయడానికి మరొక కారణం కూడా ఉంది. రీసెంట్ గా ఆయనకి కొడుకు పుట్టాడు. కాబట్టి అతన్ని ఎలిమినేట్ చేసి ఒక నాలుగు రోజులపాటు తన కొడుకును చూసుకున్న తర్వాత వైల్డ్ కార్డు ఎంట్రీ తో బిగ్ బాస్ హౌస్ లోకి రప్పించే అవకాశాలు కూడా ఉన్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి.
ఇక ఏది ఏమైనప్పటికీ ఫైనల్ గా ఆయన మాత్రం ఎలిమినేట్ అయిపోవడం అనేది ప్రేక్షకులను అలాగే శేఖర్ భాష అభిమానులను తీవ్రమైన బాధ గురి చేస్తుందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా రాజ్ తరుణ్ పర్సనల్ కేసు విషయంలో శేఖర్ భాష ఆయన తరపున పోరాడిన విధానం గాని డిబేట్ లలో పాల్గొన్నప్పుడు ఆయన మాట్లాడిన విధానం గాని ప్రేక్షకులందరిని మెప్పించింది.
దానివల్లే చాలామంది అతనికి అభిమానులుగా మారిపోయారు. ఇక బిగ్ బాస్ లోకి రావడానికి కూడా అది చాలా వరకు హెల్ప్ అయిందనే చెప్పాలి… మరి ఇలాంటి క్రమంలో శేఖర్ భాష ని ఎలిమినేట్ చేయడం అనేది బిగ్ బాస్ తీసుకున్న ఒక స్టంటా? లేదంటే నిజంగానే ఆయనను ఎలిమినేట్ చేశారా? అనేది తెలియాల్సి ఉంది…