https://oktelugu.com/

Squid Game: Season 2 ‘స్క్విడ్ గేమ్ 2’ ఫుల్ సీరీస్ రివ్యూ

ఇక ఎపిసోడ్ 3 లో వచ్చే ఒక ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. సగటు ప్రేక్షకులు కూడా ఎవ్వరు ఊహించని ధోరణిలో ట్విస్టులను డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుంది

Written By:
  • Gopi
  • , Updated On : December 27, 2024 / 09:24 PM IST

    Squid Game: Season 2

    Follow us on

    Squid Game: Season 2  స్క్విడ్ గేమ్ సిరీస్ మొదటి పార్ట్ మంచి విజయాన్ని సాధించిన విషయం మనకు తెలిసిందే…ఇక కొరియన్ భాషలోనే కాదు యావత్ వరల్డ్ వైడ్ గా ఈ సిరీస్ కి చాలా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఇక దాంతో ‘స్క్విడ్ గేమ్ 2’ కూడా తెరకెక్కించారు. అయితే రీసెంట్ గా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ఎలాంటి ఆదరణను దక్కించుకుంది. ప్రేక్షకులు ఈ సిరీస్ ని ఎలా ఆస్వాదిస్తున్నారు. మొదటి పార్ట్ తో పోలిస్తే ఈ సిరీస్ సక్సెస్ సాధించిందా? లేదా అనే విషయాలను మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం…

    కథ

    ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే షియంగ్ జీ అన్ని గేమ్ లను సక్సెస్ ఫుల్ గా ఆడి ప్రైజ్ మనీ గెలుచుకుంటాడు. అయితే ఇంతకుముందు తనకు డబ్బులతో చాలా వరకు మనీ ఇబ్బందులు ఉండేవి వాటిని తీర్చుకుంటూ ముందుకు సాగుతున్న అతనికి మనుషులను జంతువులుగా మార్చి ఒక ఆట ఆడిస్తూ ప్రాణాలు తీస్తున్న గేమ్ ను నిర్వహించే ముసుగు మనిషి గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు.

    అందుకోసమే డబ్బులను విపరీతంగా ఖర్చు పెడుతూ ఉంటాడు. మరి ఆయన వాళ్ళను కనిపెట్టే ప్రాసెస్ లో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. మొత్తానికైతే వాళ్ళు ఎందుకిలా మనుషుల్ని చంపేస్తున్నారనేది తెలుసుకున్నాడా లేదా అనేది తెలియాలంటే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ ని మీరు చూడాల్సిందే…

    విశ్లేషణ

    ఇక ఈ సీరీస్ విశ్లేషణ విషయానికి వస్తే ఒక మనిషికి డబ్బు ఎంతలా అవసరం..ఒకవేళ అది మన అవసరానికి మించి మన దగ్గర ఉంటే ఎలాంటి అనార్ధాలకు దారితీస్తుంది. అనే కొన్ని అంశాలను ఇందులో మిలితం చేసి దర్శకుడు ఈ సిరీస్ ని చాలా ఎక్స్ట్రాడినరీగా తరకెక్కించాడనే చెప్పాలి. డబ్బు ఎక్కడి వరకు మన లైఫ్ కి అవసరమో అంత వరకే దానికి ప్రాముఖ్యత ఇవ్వాలి అది కాదని దురాశకి పోతే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తాయనే పాయింట్లు కూడా చాలా బాగా చూపించాడు.

    ఇక మొత్తానికైతే దర్శకుడు రాసుకున్న స్టోరీ ని స్క్రీన్ మీద ప్రజెంట్ చేసిన విధానం అయితే బాగుంది. ఇక మధ్యలో వచ్చే ట్విస్టులు కూడా ఈ సిరీస్ ను నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్లయనే చెప్పాలి. ముందుగా కథ బాగుండడంతో ఆటోమేటిగ్గా కథనం కూడా చాలా గ్రిప్పింగ్ గా రాసుకున్నాడు…ఇక ఈ సిరీస్ ను చూసిన ప్రతి ఒక్కరూ చాలా హై ఫీలవుతూ ఉంటారని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు.మరి ఇలాంటి దర్శకుడు ఈ సినిమాని ఇంత బాగా తీర్చిదిద్దడానికి గల కారణం ఏదైనా కూడా సగటు ప్రేక్షకుడికి నచ్చే విధంగా ఈ సిరీస్ ని తీయడం అనేది మామూలు విషయం కాదు…ఇక గేమ్స్ ఆడుతున్నప్పుడు కలిగిన ఉత్కంఠ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది.

    ప్రతి ఎపిసోడ్ ని స్టార్ట్ చేసిన విధానం గాని ఎండ్ చేసిన విధానం చాలా బాగా కుదిరాయి. అలాగే ఒక్కో ఎపిసోడ్ లో ఇచ్చిన ట్విస్టులు కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయనే చెప్పాలి… ఇక ఏది ఏమైనా కూడా ఈ సిరీస్ లో ఇన్నర్ గా ఒక మెసేజ్ అయితే ఉందనే చెప్పాలి. ఇక దాంతో పాటుగా ఈ సినిమాకి మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. సినిమాటోగ్రఫీ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉందనే చెప్పాలి. మొత్తానికైతే ఈ సిరీస్ ని చూసిన ప్రతి ప్రేక్షకుడు నిరాశ చెందకుండా ఒక మోటివ్ పాయింట్ ను అయితే పొందుతూ ఉంటాడని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ముఖ్యంగా డబ్బు విషయంలో ప్రతి ఒక్కరి ఆలోచన విధానం అయితే మారిపోతుంది…ఇక ఈ సిరీస్ లో నటించిన ప్రతి నటుడు కూడా తమ ప్రాణం పెట్టి నటించారనే చెప్పాలి.

    ఇక ఎపిసోడ్ 3 లో వచ్చే ఒక ట్విస్ట్ అయితే మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది. సగటు ప్రేక్షకులు కూడా ఎవ్వరు ఊహించని ధోరణిలో ట్విస్టులను డిజైన్ చేసిన విధానం కూడా చాలా బాగుంది… ఇక అక్కడక్కడ కొన్ని సీన్లు స్లో నరేషన్ తో సాగినప్పటికి ఓవరాల్ గా సినిమాని మాత్రం దర్శకుడు చాలా గ్రిప్పింగ్ గా మలుచుకున్నాడనే చెప్పాలి…

    ప్లస్ పాయింట్స్

    కథ, కథనం
    ట్విస్టులు
    మ్యూజిక్
    సినిమాటోగ్రఫీ

    మైనస్ పాయింట్స్

    కొన్ని సీన్స్ చాలా బోరింగ్ గా ఉన్నాయి…
    రక్తపాతం కూడా ఎక్కువగా ఉంది…

    రేటింగ్

    ఇక ఈ సిరీస్ కి మేమిచ్చే రేటింగ్ 2.75/5