https://oktelugu.com/

Boyapati Srinu: మాస్ ని ఉర్రూతలూగించిన డైరెక్టర్ బోయపాటి కెరీర్ లో టాప్ 10 డైలాగ్స్ ఇవే!

బోయపాటి శ్రీను బాలయ్య బాబు కి ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ రాసాడు, ఆయన తీసిన సినిమాలలో మూడు బ్లాక్ బస్టర్ హిట్లు బాలయ్య తోనే ఉంటాయి.ముఖ్యంగా సింహా చిత్రం లోని కొన్ని డైలాగ్స్ చూద్దాము.

Written By:
  • Vicky
  • , Updated On : April 27, 2023 / 01:09 PM IST
    Follow us on

    Boyapati Srinu: టాలీవుడ్ లో ప్రస్తుతం ఉన్న డైరెక్టర్స్ మాస్ డైరెక్టర్ ఎవరు అంటే మనకి ముందుగా గుర్తుకు వచ్చే పేరు బోయపాటి శ్రీను. ఈయన సినిమాలు ఎంత మాస్ గా ఉంటాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు,హీరో తో సంబంధం లేకుండా ఈయన సినిమా వస్తుందంటే థియేటర్స్ కి మాస్ ఆడియన్స్ క్యూలు కట్టేస్తారు.భద్ర , తులసి , సింహా, లెజెండ్ మరియు అఖండ ఇలా ఎన్నో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన బోయపాటి శ్రీను ప్రస్తుతం హీరో రామ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నిన్న ఆయన పుట్టిన రోజు వేడుకలు షూటింగ్ లొకేషన్ లోనే జరిగింది. రామ్ , శ్రీలీల, శ్రీకాంత్ మరియు మూవీ యూనిట్ కేక్ కటింగ్ కార్యక్రమం లో పాల్గొన్నారు, దానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియా వైరల్ అయ్యాయి.ఇది ఇలా ఉండగా బోయపాటి 53 వ సంవత్సరం లోకి అడుగుపెట్టిన సందర్భంగా ఆయన కలం నుండి వచ్చిన టాప్ 10 పవర్ ఫుల్ డైలాగ్స్ ఏమిటో ఒకసారి చూద్దాము.

    బోయపాటి శ్రీను బాలయ్య బాబు కి ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ రాసాడు, ఆయన తీసిన సినిమాలలో మూడు బ్లాక్ బస్టర్ హిట్లు బాలయ్య తోనే ఉంటాయి.ముఖ్యంగా సింహా చిత్రం లోని కొన్ని డైలాగ్స్ చూద్దాము.

    “చూడు..ఒకవైపే చూడు..రెండో వైపు చూడాలనుకోకు..మాడిపోతావ్”.
    “కొడితే మెడికల్ టెస్టులు చేయించుకొడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవ్”.
    “నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి..కాదని ఏది పని చేసిన నీ నెక్స్ట్ బర్త్ డే ఉండదు”

    ఇక బాలయ్య బాబు తో ఆయన చేసిన రెండవ చిత్రం లెజెండ్ లో కూడా అద్భుతమైన డైలాగ్స్ ఉన్నాయి.ఈ చిత్రం కూడా బాలయ్య కెరీర్ లో మైలు రాయిగా నిలిచింది.ఇందులోని డైలాగ్స్ ఒకసారి చూద్దాం.

    “ఫ్లూటు జింక ముందు ఊదు..సింహం ముందు కాదు”.
    “నువ్వు భయపెడితే బయపడడానికి నేను ఓటర్ ని అనుకున్నావా బే..షూటర్ ని కాల్చి పారేస్తా కొడకా”.
    “నీకు బీపీ వస్తే నీ PA వణుకుతాడేమో,నాకు బీపీ వస్తే AP వణుకుద్ది”.
    “నీకు నరికేకొద్దీ అలుపొస్తాడేమో..కానీ నాకు ఊపు వస్తాది”.

    ఇక జూనియర్ ఎన్టీఆర్ తో చేసిన దమ్ము చిత్రం కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేదు కానీ , ఇందులోని ఒక డైలాగ్ బాగా పాపులర్ అయ్యింది, ఆ డైలాగ్ ఏంటో ఒకసారి గుర్తు చేసుకుందాము.

    “బ్రతకండి బ్రతకండి అంటే వినలేదు కదా రా..కొత్తమొదలైంది..ఇక రాత రాసిన భగవంతుడు వచ్చినా ఆపలేదు”.

    ఇక రీసెంట్ గా విడుదలై బాక్స్ ఆఫీస్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ సృష్టించిన అఖండ లోను అదిరిపొయ్యే డైలాగ్స్ ఉన్నాయి.

    “కాళ్ళు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది, కారుకూతలు కూస్తే కపాలం పగిలిపోద్ది”.
    “ఎదుటి వాడితో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలో నేర్చుకో..శ్రీను గారు మీ నాన్న గారు బాగున్నారా అనడానికి..శ్రీను గారు నీ అమ్మమొగుడు బాగున్నాడా అనే దానికి చాలా తేడా ఉందిరా ల**డి కొడకా”.

    ఇలా బోయపాటి సినిమాల్లో సన్నివేశాలు ఎంత పవర్ ఫుల్ గా ఉంటాయో, డైలాగ్స్ కూడా అంతే పవర్ ఫుల్ గా ఉంటాయి.అందుకే బోయపాటి శ్రీను సినిమాలంటే మాస్ ఆడియన్స్ కి ఒక విజువల్ ట్రీట్ లాగా ఉంటుంది.