https://oktelugu.com/

Visakhapatnam : విశాఖ స్వాతి ఆత్మహత్యలో ట్విస్ట్.. సూసైడ్ నోట్ లో షాకింగ్ విషయాలు

అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో బీచ్ రోడ్ లో పెట్రోలింగ్ చేస్తున్నపోలీసులకు అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. సగం ఇసుకలో కూరుకుపోయింది. ఒంటిపై లో దుస్తులు మాత్రమే ఉన్నాయి.

Written By:
  • Dharma
  • , Updated On : April 27, 2023 / 01:21 PM IST
    Follow us on

    Visakhapatnam : దాంపత్యంలో చిన్నచిన్న మనస్పర్థలు బలవన్మరణాలకు పురిగొల్పుతున్నాయి. కుటుంబంలో చిన్నపాటి విభేదాలు ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి. విశాఖ నగరంలో ఇటువంటి ఘటనే తాజాగా వెలుగులోకి వచ్చింది. విశాఖ రామక్రిష్ణా బీచ్ లో అనుమానాస్పదంగా ఓ యువతి శవమై కనిపించింది. ఇసుకలో కూరుకుపోయిన మృతదేహంపై లోదుస్తులు మాత్రమే ఉండడంతో అనేక రకాలైన అనుమానాలు తలెత్తాయి. చివరకు ఆమె రాసిన సుసైడ్ నోట్ లభ్యం కావడంతో ఆత్మహత్య అని పోలీసులు నిర్థారణకు వచ్చారు. ఆ దిశగా దర్యాప్తు ప్రారంభించారు. అత్తింటి వేధింపుల వల్లే తన కుమార్తె చనిపోయిందంటూ మృతురాలి తల్లి ఆరోపిస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.

    ఏడాది కిందట వివాహం

    విశాఖలోని దొండపర్తి ప్రాంతానికి చెందిన శ్వేత కు పెదగంట్యాడ మండలం నెల్లిముక్కు ప్రాంతానికి చెందిన గులివెల్లి మణికంఠతో గత ఏడాది ఏప్రిల్‌ 22న వివాహమైంది. మణికంఠ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. రెండేళ్లుగా ఇంటి వద్ద నుంచే (వర్క్‌ ఫ్రమ్‌ హోమ్) పనిచేస్తున్నాడు. భార్య, తల్లిదండ్రులతో కలిసి నెల్లిముక్కులో ఉంటున్నాడు. పదిహేను రోజుల కిందట ఆఫీస్‌ పని మీద హైదరాబాద్‌ వెళ్లాడు. మంగళవారం సాయంత్రం అత్త, మామలు పుష్పలత, శాంతరావులు బయటకు వెళ్లారు. అదే సమయంలో శ్వేత భర్తకు ఫోన్‌ చేసింది. ఫోన్‌లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిసింది. అనంతరం శ్వేత ఇంట్లోనే ఫోన్‌ను వదిలిపెట్టి తాళం వేసుకుని బయటకు వెళ్లిపోయింది. బయట నుంచి వచ్చిన అత్తమామలు ఇంటికి తాళం వేసి ఉండడంతో కోడలికి ఫోన్ చేశారు. కానీ ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. బంధువులు, స్నేహితుల ఇంట్లో ఆరాతీసినా ఆచూకీ లేకుండా పోయింది. దీంతో రాత్రి పది గంటల సమయంలో న్యూపోర్టు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేశారు.

    అనుమానాస్పందంగా..
    అయితే అర్ధరాత్రి దాటిన తరువాత 2 గంటల సమయంలో బీచ్ రోడ్ లో పెట్రోలింగ్ చేస్తున్నపోలీసులకు అనుమానాస్పద స్థితిలో యువతి మృతదేహం కనిపించింది. సగం ఇసుకలో కూరుకుపోయింది. ఒంటిపై లో దుస్తులు మాత్రమే ఉన్నాయి. అయితే ఆ మృతదేహం శ్వేతగా గుర్తించిన పోలీసులు అత్తమామలకు సమాచారమందించారు.. ఇంట్లో శ్వేత రాసినట్టుగా ఒక సూసైడ్‌ నోట్‌ లభ్యం కావడంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు. యువతి తల్లి ఫిర్యాదు మేరకు భర్త, అత్తమామలపై వేధింపులు, ఆత్మహత్యకు ప్రేరేపించడం, గృహహింస వంటి సెక్షన్లపై కేసు నమోదుచేసినట్టు న్యూపోర్టు పోలీస్ స్టేషన్ సీఐ రామారావు తెలిపారు.

    బలమైన కారణాలు?
    కాగా చనిపోయిన శ్వేత ఐదు నెలల గర్భిణి.తనతో పాటు కడుపులో ఉన్న బిడ్డను సైతం చంపుకుంటూ నిర్ణయం తీసుకుంది. అయితే ఆమె బలవన్మరణానికి బలమైన కారణాలు ఉన్నట్టు తెలుస్తోంది. సూసైడ్ నోట్ లో కూడా ఘాటైన వ్యాఖ్యలు చేసింది. ‘నాకు ఎప్పుడో తెలుసు. నేను లేకుండా నువ్వు బిందా్‌సగా ఉండగలవు అని. ఎనీవే ‘ఆల్‌ ది బెస్ట్‌’ ఫర్‌ యువర్‌ ‘ఫ్యూచర్‌ అండ్‌ న్యూ లైఫ్‌’. చాలా మాట్లాడడానికి ఉన్నా.. ఏమీ మాట్లాడట్లేదు. నువ్వు ఒప్పుకున్నా, ఒప్పుకోకపోయినా యూ నో ఎవ్రీథింగ్‌. క్వశ్చన్‌ యువర్‌ సెల్ఫ్‌. ఏ బిగ్‌ థాంక్స్‌ ఫర్‌ ఎవ్రీ థింగ్‌’ అంటూ ముగించింది. కాగా తన కుమార్తె మృతికి భర్త, అత్తమామలే కారణమని తల్లి రమ ఆరోపిస్తోంది. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతోంది.