https://oktelugu.com/

Pushpa 2: పుష్ప 2 టీజర్ లో ఎవ్వరూ గమనించని విషయాలు ఇవే…

ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు.

Written By: , Updated On : April 8, 2024 / 01:37 PM IST
These are the things that no one noticed in Pushpa 2 teaser

These are the things that no one noticed in Pushpa 2 teaser

Follow us on

Pushpa 2: ప్రస్తుతం ఇండియాలోనే ‘ పుష్ప’ అనే పేరుకి ఒక బ్రాండ్ అయితే ఉంది. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించింది. ఇక మొదటిసారిగా అల్లు అర్జున్ పాన్ ఇండియాలో తన సత్తా చాటుకున్న సినిమా కూడా ఇదే కావడం విశేషం. ఇక దానికి తగ్గట్టుగానే ఇప్పుడు పుష్ప కి సీక్వెల్ గా ‘పుష్ప ది రూల్’ అనే పేరుతో ఒక సినిమా వస్తుంది.

అయితే ఈ సినిమా మీద ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి. ఇక దానికి తగ్గట్టుగానే ఈరోజు అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని రిలీజ్ చేశారు. అయితే గంగమ్మ జాతరలో జరిగే ఫైట్ ఎపిసోడ్ ని హైలెట్ గా చేస్తూ ఈ టీజర్ ని రిలీజ్ చేయడం అనేది అల్లు అర్జున్ అభిమానులతో పాటు ప్రేక్షకులకు కూడా చాలా మంచి కిక్కు ఇచ్చిందనే చెప్పాలి… అయితే ఈ టీజర్ లో మనం గమనించాల్సిన ముఖ్యమైన రెండు విషయాలు ఏంటి అంటే ఈ ఫైట్ మంగళం శ్రీను మనుషులతో జరగబోతున్నట్టుగా తెలుస్తుంది. తన బామ్మర్ది మరణానికి రివెంజ్ తీర్చుకోవడానికి గాను మంగళం శ్రీను తన మనుషులతో పుష్ప మీద అటాక్ చేయించి చంపాలని చూస్తాడు.

ఇక అదే టైంలో పుష్ప ‘గంగమ్మ ‘ గెటప్ లో దర్శనమిచ్చి వాళ్ళందరి తుప్పు రేగ్గోడుతున్నట్టుగా ఆ టీజర్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇక ఈ సినిమాలో ఈ ఫైట్ తర్వాత నుంచే పుష్ప ది రూల్ అనేది స్టార్ట్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక మరొక విషయం ఏంటంటే మూడు నెలల ముందు వచ్చిన పుష్ప 2 గ్లిమ్స్ ని కనక మనం అబ్జర్వ్ చేసినట్లయితే అందులో పుష్ప మిస్సింగ్ అనే ఒక న్యూస్ ని హైలైట్ చేస్తూ ఆ గ్లిమ్స్ ని వదిలారు.

ఇక ఈ టీజర్ లో పుష్ప ఇజ్ బ్యాక్ అన్నట్టుగా గంగమ్మ గెటప్ లో దర్శనమిప్పించారు. ఇవన్నీ చూస్తుంటే పుష్ప సినిమాను మించి ఈ సీక్వెల్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక గంగమ్మ గెటప్ లో అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ లో ఉండ బోతుందని ఈ టీజర్ చేస్తేనే అర్థం అవుతుంది. ఇక ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకులందరికి థియేటర్లో పూనకాలు రావడం పక్కా అనేది మాత్రం చాలా స్పష్టం గా తెలుస్తుంది.
Pushpa 2 The Rule Teaser | Allu Arjun | Sukumar | Rashmika Mandanna | Fahadh Faasil | DSP